తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చివరి నిమిషంలో తీసుకున్న ఆ నిర్ణయం సూపర్ హిట్ అయ్యింది. తెలుగుదేశం స్ట్రాటజీ అర్ధం కాక, జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పెద్దలు విలవిలలాడి పోయారు. విషయానికి వస్త, నిండు సభలో చంద్రబాబు సతీమణిని వైసీపీ నేతలు కొడాలి నాని, అంబటి, ద్వారంపూడి దూషించారు. లోకేష్ పుటుక గురించి, డీఎన్ఏల గురించి మాట్లాడారు. నిండు సభలో అది సహించలేని చంద్రబాబు, 40 ఏళ్ళు తనకు అన్నీ తానై ఉన్న తన సతీమణిని ఇలా బజారులో పెట్టటం పై సహించలేక పోయారు. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. అదే రోజు అసెంబ్లీలో, ఈ కౌరవ సభను గౌరవ సభను చేసి కానీ, మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టను అని శపధం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసారు. అసెంబ్లీకి మళ్ళీ సియంగానే వస్తానని శపధం చేసారు. అయితే తరువాత జరిగిన పరిణామాల్లో, బడ్జెట్ సమావేశాలు మొదలు కావటంతో, టిడిపిలోని మిగతా ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు వెళ్ళాలా వద్దా అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. పోలిట్ బ్యూరో సమావేశం, ఆ తరువాత జరిగిన ఎమ్మెల్యేల సమావేశం, ఇలా అనేక మీటింగ్లు జరిగాయి. ఎక్కవ మంది సమావేశాలకు వెళ్ళాక పోవటమే మంచిందని, కానీ ఫైనల్ నిర్ణయం చంద్రబాబుకు వదిలి పెడుతున్నాం అని అన్నారు.
అయితే చంద్రబాబు మాత్రం, అందరిలా ఎందుకు ఆలోచిస్తారు. అందరిలా ఆలోచిస్తే ఆయన ఇంతటి మహా నాయకుడు ఎలా అవుతారు ? చంద్రబాబు మాత్రం, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలని, ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని, తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతం అని, మనం ప్రజల కోసం నిలబడాలి అని ఎమ్మెల్యేలకు చెప్పారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి వెళ్ళారు. అయితే ఎవరూ ఊహించని విధంగా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి పై చేయి సాధించింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటంతోనే, వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యింది. అక్కడ నుంచి మొదలు పెడితే, ప్రతి అంశంలోనూ జగన్ మోహన్ రెడ్డిని ఎక్ష్పొజ్ చేయటంలో టిడిపి సక్సెస్ అయ్యింది. కమ్మ డీఎస్పీల విషయంలో, జగన్ అబద్ధాలు బట్టబయలు అయ్యాయి. పోలవరంలో జగన్ అసమర్ధత బయట పడింది, మద్యం అమ్మితేనే తన ప్రభుత్వం నడుస్తుందని చెప్పాల్సిన పరిస్థితి, ఇక మూడు రాజధానుల పై సుప్రీం కోర్టుకు వెళ్ళకుండా, అసెంబ్లీలో చర్చించిన విధానం, ఇలా అన్ని విషయాల్లో జగన ఎక్ష్పొజ్ అయ్యారు. టిడిపి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అనే టిడిపి నిర్ణయం, ఇప్పుడు సూపర్ హిట్ అయ్యింది.