హైకోర్టు చేతిలో జగన్ మోహన్ ప్రభుత్వానికి, ఎన్ని మొట్టికాయలు పడ్డాయో అందరికీ తెలుసు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత, అడ్డగోలు, చట్ట వ్యతిరేకత నిర్ణయాలకు కోర్టుల దగ్గర ఎదురు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి దానికి కోర్టులతో చంద్రబాబు చేయిస్తున్నాడు అంటూ ఒక విష ప్రచారం అయితే వైసీపీ చేస్తుంది. ఇలాంటి చట్ట వ్యతిరేక నిర్ణయమే అమరావతి. ఒక పక్క అభివృద్ధి చేస్తాం అని, అమరావతి రైతుల దగ్గర నుంచి ఏపి ప్రభుత్వం భూములు తీసుకుంది. దీని కోసం ఒక చట్టం, ఒక ఒప్పందం లాంటివి కూడా జరిగాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఒప్పందం లేదు ఏమి లేదు, చట్టం లేదు ఏమి లేదు అని మొత్తం రద్దు చేసి పడేయటంతో, రైతులు కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు, ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డెవలప్ చేయాల్సిందే అంటూ, 307 పేజీల సుదీర్ఘ తీర్పు ఇచ్చింది. అయితే దీని పైన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అర్ధం కావటం లేదు. ఇప్పటికే హైకోర్టు పై పరోక్షంగా విమర్శలు చేస్తూ, మా అసెంబ్లీ చేసిన తీర్మానానికి కోర్టు జోక్యం ఏమిటి అంటూ, వైసీపీ ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బడ్జెట్ లో చూస్తే, వీరి వైఖరి పై ఒక క్లారిటీ వస్తుంది.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి అసలు నిధులు ఏమి బడ్జెట్ లో కేటాయించ లేదు. కేవలం అక్కడ అమరావతి రైతులకు ఇచ్చే కౌలు, పెన్షన్లు లాంటి వాటికి మాత్రమే కేటాయింపులు చేసారు. మొత్తం అమరావతి కోసం రూ.1329.21 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. అయితే అందులో 800 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని అంచనా వేస్తున్నారు. అసలు కేంద్రం ఎందుకు ఇస్తుంది ? ఇప్పటికే గత టిడిపి హాయాంలో కేంద్రం 1500 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నాశనం చేస్తుంటే, కేంద్రం ఎందుకు ఇస్తుంది అనేది క్లారిటీ లేదు. అంటే మిగతా 529 కోట్లలో కౌలుకి, పెన్షన్లకు, ఇతర అవసరాలకు సరిపోతాయి. మరి కోర్టు ఆదేశాలు ప్రకారం, అమరావతిలో అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ ? దీని పైన ఎలాంటి క్లారిటీ లేదు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించే సాహసం చేస్తుందా ? లేదా సుప్రీం కోర్టుకు అపీల్ కు వెళ్తుందా ? అమరావతి విషయంలో, జగన్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మరి.