ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నా, ఇప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు. జగన్ మోహన్ రెడ్డి ముందస్తుకు వెళ్ళిపోతారు అంటూ ఊహాగాణాలు వస్తున్నాయి. దానికి తగ్గటుగానే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి పై రోజు రోజుకీ అన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది. ఇది మరింత విస్తరించే ముందే, జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళిపోవాలని భావిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక కష్టాలు కూడా ఉన్నాయి. మొత్తం అప్పులు మయం చేసి పడేసాడు. ఆదాయం లేదు, డబ్బులు లేవు, దీంతో పధకాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో బీజేపీ, పంజాబ్ తప్ప అన్నీ గెలుచుకుంది. ఈ రాష్ట్రాల్లో ప్రజలు దేన్నీ బేస్ చేసుకుని ఓట్లు వేసారు అనే అంశం పైన, అనేక సర్వే సంస్థలు సర్వే చేసాయి. ఇందులో చాలా ఆసక్తికర విషయాలు వేలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికలకు రెడీ అవుతున్న ఆంధ్రప్రదేశ్ పార్టీలకు, ఈ సర్వే సమాచారం ఎంతో ఉపయోగ పడుతుంది. ఆక్సిస్ మై ఇండియా అనే సంస్థ చేసిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
నాలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ సర్వే చేసింది. ఏ ప్రాతిపదికిన ఓట్లు వేసి గెలిపించారు అనేది సర్వే సారంశం. ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రదమైన అంశం, నా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి. దాదాపుగా ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆవేరేజ్ న , 22 శాతం మంది ప్రజలు అభివృద్ధి కోసమే ఓట్లు వేసి గెలిపించినట్టు సర్వేలో తేలింది. ఇక సంక్షేమ పధకాలు అనేవి, మూడు రాష్ట్రాల్లో అసలు ఊసే లేదు, ఉత్తర ప్రదేశ్ లో మాత్రం, ఆరు శాతం మంది ప్రజలు సంక్షేమ పధకాలు గురించి ప్రస్తావించారు. అలాగే మరో సంస్థ చేసిన సర్వేలో కూడా, అభివృద్ధి కోసమే ఓట్లు వేశామని చెప్పారు. దీంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ సర్వే ఫలితాలు చూసి, టిడిపి సంతోష పడుతుంది. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా అభివృద్ధి లేదు. సంక్షేమం ఏదో చేసేస్తున్నట్టు చెప్తున్నారు కానీ, వాస్తవంలో అదీ సరిగ్గా లేదు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు ఈ అంశాలు హైలైట్ అయ్యాయి. దేశంలో ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. మరి ఈ సర్వే ఫలితాలు మన రాష్ట్రానికి ఎంత వరకు ఉపయోగపడతాయో, మన రాష్ట్ర ప్రజలు ఏమి అనుకుంటున్నారో, ఎన్నికల వరకు చూడాలి మరి.