వైసీపీ ప్రభుత్వం గుట్టుగా చేసిన వ్యవహరం ఇది. అయితే వాళ్ళ పార్టీ ఎంపీలే గుట్టు రట్టు చేసిన అనూహ్య ఘటన నిన్న పార్లమెంట్ లో జరిగింది. న్యూక్లియర్ శక్తి కోసం ఉపయోగపడే బీచ్ స్యాండ్ మన రాష్ట్రంలో అధికంగా ఉంది. వీటిని వైసీపీ ప్రభుత్వం విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్టు కేంద్రం భావిస్తుంది. సహజంగా ఇవి ఎగుమతి చేయాలియా అంటే, కేంద్రం అనుమతి తప్పని సరి. అణు ఇంధన సంస్థ ప్రత్యేక అనుమతి ఉంటే కానీ, ఇది సాధ్య పడదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవి అక్రమంగా తరలిస్తుంది అంటూ కేంద్రానికి ఫిర్యాదులు వెళ్ళటంతో, కేంద్రం దీని పై సమగ్ర విచారణ కోరింది. అంతే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బీచ్ సాండ్ కోసం కోరిన అనుమతులు కూడా కేంద్రం రద్దు చేసింది. ఈ నేపధ్యంలోనే అనూహ్యంగా వైసీపీ ఎంపీలు నిన్న కేంద్రాన్ని ఇదే అంశం పై ప్రశ్నించారు. ఏపి ప్రభుత్వం బీచ్ సాండ్ మైనింగ్ అనుమతిని కేంద్రం పరిగణలోకి తీసుకుండా లేదా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అనూహ్యంగా ఈ ప్రశ్నకు, ప్రధాని కార్యాలయ మంత్రి జితేందర్‌సింగ్‌ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సమాచారం ఉంది. అసలు వైసీపీ ఎంపీలు, కావలని, ఈ ప్రశ్నలు ఎందుకు అడిగి, ఎదురు వాళ్ళ గుట్టు బయట పెట్టుకున్నారు అనేది అర్ధం కాని ప్రశ్న.

ycp 17032022 2

ఇక కేంద్రం సమాధానంలో ఉన్న అంశాలు ఏమిటి అంటే, మచిలీపట్నం, భీమిలి నుంచి బీచ్ సాండ్ తీసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఏపి నుంచి ఈ బీచ్ సాండ్ పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్లినట్టు మాకు ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం తెలిపింది. ఈ ఫిర్యాదులు న్యూక్లియార్ ఎనర్జీకి సంబంధించినవి కావటంతో, కేంద్రం సీరియస్ గా తీసుకుని, దీని పై సమగ్ర నివేదిక కావాలని రాష్ట్రాన్ని కోరాయి. అక్రమ మైనింగ్ పై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరినా రాష్ట్రం ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 17 చోట్ల అనుమతి కోరగా, తాము రెండు చోట్ల అనుమతి ఇచ్చామని, అక్కడ కూడా అక్రమాలు జరిగాయని తెలియటంతో, మిగతా 15 చోట్ల అనుమతి ఇవ్వలేదని కేంద్రం చెప్పింది. మిగతా రెండు చోట్ల నుంచి తీసిన బీచ్ స్యాండ్ ఏమి చేసారు అని రాష్ట్రాన్ని కోరగా, ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి సమాధానం లేదని కేంద్రం చెప్పింది. మొత్తానికి దేశ భద్రతకు సంబంధించి కీలక అంశం అయిన, న్యూక్లియర్ పవర్ లో కూడా, రాష్ట్ర ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతుందని అర్ధం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read