ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత, ఆ ఆరోపణలు నిజం కాదని, అదే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిన్న శాసనసభలో రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో, ఈ విషయం బయట పడింది. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 37 మంది డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చిన సమయంలో, 35 మంది ఒకే సామజిక వర్గం వారని, అందరూ చంద్రబాబు సామాజికవర్గం వారని, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, ఫిర్యాదు చేయటమే కాకుండా, ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేసారు. అప్పట్లో జగనే స్వయంగా, మీడియా ముందుకు వచ్చి, 37 మంది డీఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తే, అందులో 35 మంది చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. అయితే ఇదే అంశానికి సంబంధించి, అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతున్నా, ఎందుకు దర్యాప్తు చేయలేదు అంటూ, అదే విధంగా అసలు ఇందులో వాస్తవాలు ఏంటి, వారి కులాలు ఏంటి, అసలు ఈ అంశం పై ఏ చర్యలు తీసుకున్నారు, ఒకే సామాజికవర్గం అనేది నిజమేనా అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేసారు.
తెలుగుదేశం సభ్యులు వేసిన ప్రశ్నకు, రాష్ట్ర హోంమంత్రి సుచరిత లిఖిత పూర్వక సమాధానం పంపారు. ఈ సమాధానంలో ఆరోపణలు నిజం కాదని, ప్రమోషన్లలో ఎలాంటి అన్యాయం జరగలేదని, అందులో అందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కాదని చెప్పి ఆమె స్పష్టంగా సమాధానం ఇచ్చారు. దీంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన ఆరోపణలు నిజం కాదని తేలిపోయింది. అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు హోంమంత్రి సుచరిత సమాధానం ఇవ్వటంతో, ఈ అంశం పై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పు బడుతూ, జగన్ చేసిన ఫేక్ ని బయట పెట్టారు. నిన్న అసెంబ్లీలో కూడా , గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై, తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, అన్నీ అబద్ధాలు చెప్తూ బ్రతికారని, అప్పట్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చేందుకు అడ్డ దారులు తొక్కి, ఇప్పుడు అసలు వాస్తవం వారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, ఇలాంటివి ఎన్నో ఉన్నాయని, టిడిపి ఆరోపిస్తుంది.