అవతల వైపు 151 మంది ఉన్నారు, ఇటు వైపు నుంచి టిడిపి ఎమ్మెల్యేలను నలుగురుని లాక్కున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీకి రావటం లేదు. తన భార్యను సభలో అవమానించటం పైన, ఆయన సవాల్ చేస్తూ, మళ్ళీ సభలో తాను సియంగా అడుగుపెడతా అని, దీన్ని గౌరవ సభను చేస్తాను అంటూ, ఆయన సభను బహిష్కరించారు. ఇంకేముంది, తెలుగుదేశం పార్టీ నేతలను ఒక ఆట ఆడుకోవచ్చు అని వైఎస్ఆర్ పార్టీ భావించింది. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలు పెట్టిన దగ్గర నుంచి సీన్ రివర్స లో నడుస్తుంది. మొదటి రోజు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పై చేయి సాధించింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా టిడిపి పన్నిన వ్యూహానికి జగన్ మోహన్ రెడ్డి బిత్తరపోయారు. రాజ్యాంగాన్ని పరిరక్షించలేని గవర్నర్ అంటూ, తెలుగుదేశం పార్టీ గవర్నర్ ప్రసంగానికి అడ్డు పడింది. గవర్నర్ పూర్తి స్థాయిలో విఫలం అయ్యారు అంటూ, తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. సభలో నినాదాలు చేస్తూనే ఉంది. దీంతో గవర్నర్ ప్రసంగం రోజున, టిడిపి పై చేయి సాధించి, టిడిపి చేసిన ఆందోళన ప్రజల్లోకి వెళ్ళింది. టిడిపి ఇలా నిరసన తెలుపుతుందని, అసలు వైసీపీ ఊహించలేక, దానికి కౌంటర్ స్ట్రాటజీ ఏమి లేక, ఆ రోజు వైసీపీ బేలతనం బయట పడింది.
ఇక రెండో రోజు పూర్తి స్థాయిలో టిడిపి పట్టు సాధించింది. నాడు-నేడు విషయంలో వైసీపీ చేస్తున్న మోసం ఎక్ష్పొజ్ అయ్యింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా టిడిపి అడిగిన ప్రశ్నకు, సమాధానం చెప్పలేక, అనిల్ కుమార్ అరుపులు కేకలతో ముగించారు. ఇక అన్నిటికీ మించి, గతంలో 35 కమ్మ డీఎస్పీలు అంటూ, జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రచారం బట్టబయలు అయ్యింది. ఆ రోజు కూడా టిడిపి పై చేయి సాధించిది. తరువాత గౌతం రెడ్డి మరణం సంతాపంతో, సభ ముగిసినా, రోశయ్యకు సరైన గౌరవం ఇవ్వలేదు అనేది ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తరువాత రోజు రోశయ్యకు సంతాపం ప్రకటించారు. ఇక గత మూడు రోజులుగా జంగారెడ్డిగూడెం సంఘటనతో, ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ముందు రోజు 5 మంది టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసారు. తరువాత రెండు రోజులు, మిగతా ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేసారు. ఉన్న పది మందికి కూడా వైసీపీ సమాధానం చెప్పలేక పోతుంది. మొత్తానికి ఇప్పటి వరకు అయితే అసెంబ్లీలో ఉన్న 15 మందితోనే, టిడిపి పై చేయి సాధించింది.