ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అనేది ఈ మధ్య సర్వ సాధారణం అయిపోయింది. రూల్స్ అనేవి కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే అని, అధికార పక్షం ఏమి చేసినా ఏమి ఉండదు అనే విధంగా వ్యవస్థలు పని చేస్తున్నాయి. మంత్రి అప్పలరాజు పోలీసులను నెట్టేసి, తిట్టినా కేసు ఉండదు, పార్ధసారధి గు* పగల గొడతా అని చెప్పినా కేసులు ఉండవు, ఇలా ఎన్నో సంఘటనలు. టిడిపి నేతలు కుయ్యి కయ్యి మంటే మాత్రం కేసులు, అరెస్టులు హంగామా. ఇది కేవలం అధికార పార్టీ నేతలే కాదు, కొంత మంది అధికారులు కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇందులో మొదటి వరసులో ఉంటారు సిఐడి చీఫ్ సునీల్ కుమార్. ఆయన పైన ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేసాయి. సిఐడి అన్నిట్లో దూరటం, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయటం, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేయటం, చివరకు సొంత పార్టీ ఎంపీ పైన థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించటం, ఇలా అనేక ఆరోపణలు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పైన ఉన్నాయి. దీనికి తోడు ఆయన క్రీస్టియన్ సంస్థతో చేస్తున్న పనుల పై కూడా, అనేక ఆరోపణలు, కేంద్రం ఎంక్వయిరీ చేయమని చెప్పటం, ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సిఐడి చీఫ్ పై, సొంత మామ ఫిర్యాదు చేయటం వార్తల్లో అంశంగా మారింది.
వ్యక్తిగత కక్షకు కూడా ఆయన తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారని, ఆయన పైన ఎంక్వయిరీ చేయాలి అంటూ, సిఐడి సునీల్ కుమార్ మామ, హైకోర్టులో ఫిర్యాదు చేసారు. తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని, కుటుంబ సభ్యుల పైన ఫేక్ కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని, ఆయన పైన విజిలెన్స్ కానీ, సిబిఐ ఎంక్వయిరీ కానీ చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సునీల్ కుమార్ భార్య, ఆయన పైన గ్రుహ హింస కేసు పెట్టిందని, అప్పటి నుంచి సునీల్ కుమార్ తమను వేధిస్తున్నారు అంటూ ఆయన ఫిర్యాదు చేసారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సోదరిని, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. అయితే తరువాత గొడవలు రావటంతో, ఆమె సునీల్ కుమార్ పై కేసు పెట్టారు. అప్పటి నుంచి సునీల్ కుమార్, ఆ కుటుంబం పైన అక్రమ కేసు పెట్టటం, నోటీసులు ఇవ్వటం, అరెస్ట్ లు చేయటం వంటివి చేస్తున్నారని, తన అధికారాన్ని, వ్యక్తిగత కక్ష తీర్చుకోవటానికి, ఉపయోగిస్తూ ఇబ్బంది పెడుతున్నారు అంటూ, హైకోర్టులో ఫిర్యాదు చేసారు.