ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీలో జగన్ మోహన్ రెడ్డికి, షర్మిలకు మధ్య విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ సునీత కూడా జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకం అయ్యారు. వైఎస్ వివేక కేసు విషయంలో కూడా, జగన్ మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని వెనకేసుకుని రావటం పైన కూడా వైఎస్ ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఇంటి ఆడ బిడ్డ న్యాయం కోసం ఢిల్లీలో అలా పాకులాడటం చూసి, వైఎస్ కుటుంబంలో కొంత మంది జగన్ పై ఆగ్రహంగా ఆన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ఉన్న పెద్ద వైఎస్ ప్రతాప్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ తో, ఈ విషయం పై క్లారిటీ వస్తుంది. అవినాష్ రెడ్డి పాత్ర గుర్తించి, ఆయన సిబిఐకు మొత్తం చెప్పేసారు. దీంతో, ఇప్పుడు మళ్ళీ వైఎస్ కుటుంబంలో వివాదాలు బయట పడ్డాయి. వైఎస్ ప్రతాప రెడ్డికి 78 ఏళ్ళు . ఆయన జగన్ మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి పెదనాన్న అవుతారు. వైఎస్ వివేక చిన్నన్న కొడుకు వైఎస్ ప్రతాప రెడ్డి. వైఎస్ ప్రాతాప రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో, వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర గురించి, పూసగుచ్చినట్టు మొత్తం సిబిఐకు తెలియ చేసారు. ప్రాతప రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తో, సిబిఐకి కావలసిన ఆధారాలు లభించినట్టు, అవినాష్ రెడ్డికి ఉచ్చు గట్టిగా బిగిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
వైఎస్ ప్రతాప రెడ్డి పలు కీలక విషయాలు చెప్పారు. వైఎస్ వివేక తన వద్దకు తరుచూ వచ్చే వారని, ఈ సారి ఎంపీ టికెట్ విజయమ్మకు కానీ, షర్మిలకు కానీ ఇవ్వాలని పట్టుబట్టే వారని, అవినాష్ రెడ్డిని జమ్మలమడుగుకు పంపించాలని ఆయన చెప్పే వారని చెప్పారు. అలాగే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి, ముందు నుంచి వివేక అంటే కోపం అని, వివేకాకి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డికి విబేధాలు ఉన్నాయని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోవటంలో, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్టు చెప్పారు. ఇక వివేక హ-త్య జరిగిన రోజు, మనోహర్ రెడ్డి ఫోన్ చేస్తే అక్కడకు వెళ్లానని, గుండె నొప్పి అని అవినాష్ రెడ్డి అందరికీ చెప్తున్నాడని, అయితే అక్కడ సీన్ చూస్తే మాత్రం, గుండె నొప్పిగా లేదని అన్నారు. అక్కడ హడావిడిగా రక్తం తుడవటం, కుట్లు వేయటం, ఫోటోలు తీస్తుంటే అరవటం, ఇవన్నీ చూసి తేడాగా ఉందని, అక్కడ జరుగుతున్నవి చూడలేక, ఇంటికి వచ్చేసా అని వైఎస్ ప్రాతాప రెడ్డి, సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో మొత్తం వివరించారు.