వైఎస్ వివేక కేసుతో, వైఎస్ ఫ్యామిలీ నిలువునా చీలింది. జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఒక వైపు ఉంటే, మిగతా ఫ్యామిలీ మొత్తం ఒక వైపు ఉంది. విజయమ్మ, షర్మిల కూడా, వైఎస్ సునీతకు అండగా ఉన్నరనే ప్రచారం జరుగుతుంది. అయితే గత రెండు మూడు రోజులుగా వైఎస్ సునీతా, ఆమె భర్త సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లు వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. సాక్ష్యాలు అన్నీ వైఎస్ అవినాష్ రెడ్డి వైపే వేళ్ళు చూపిస్తున్నాయి. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వేచి చూసే ధోరణిలో ఉండాల్సింది పోయి, అనూహ్యంగా అవినాష్ రెడ్డిని వెనకేసుకుని వచ్చే చర్యలు అందరినీ ఆశ్చర్య పరిచాయి. ఒక వేళ నిజంగా అవినాష్ తప్పు ఉంటే, ఆయన శిక్ష అనుభవిస్తాడు. వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇంతోటి దానికి, ఈ రోజు సజ్జల ప్రెస్ మీట్ పెట్టి, అవినాష్ రెడ్డినే కాకుండా, దేవిరెడ్డి శంకర్ రెడ్డిని కూడా వెనకేసుకుని వచ్చారు. అయితే ఈ రోజు సజ్జల, సునీత మీద చేసిన వ్యాఖ్యలు చూసి వైసిపీ శ్రేణులు కూడా ఆశ్చర్య పోయాయి. ఇన్నాళ్ళు జగన్ మోహన్ రెడ్డి నిర్మించుకున్న క్రెడిబిలిటీ మొత్తం, ఒక్క దెబ్బతో పోయిందని, సజ్జల చేత జగన్ ఇలా చెప్పించటం ఆశ్చర్యాన్ని కలిగించిందని వైసీపీ శ్రేణులు వాపోతున్నారు.
వైఎస్ సునీత సిబిఐకి స్టేట్మెంట్ ఇవ్వటం, ఈ పరిణామాలు మొత్తం చంద్రబాబు చేపిస్తున్నారని, చంద్రబాబు, చేతిలో సునీత పావు అని, సునీత, చంద్రబాబు కలిసి కుట్రలు పన్నుతున్నారని, సునీతకు టిడిపి టికెట్ ఇస్తారని, అవసరం అనుకుంటే సునీత టిడిపి నుంచి పోటీ చేయవచ్చని, తమకు ఏమి అభ్యంతరం లేదని, ఇలా సజ్జల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.అలాగే వివేక అల్లుడు పైన కూడా సజ్జల విరుచుకు పడ్డారు. మొత్తం చంద్రబాబు చెప్పినట్టు, సునీత చేస్తున్నారు అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు, అందరినీ ఆశ్చర్య పరిచాయి. ఇంటి ఆడ బిడ్డకు అండగా ఉండాల్సిన సమయంలో, ఆమెను చంద్రబాబు పావు అంటూ, రాజకీయ కోణం జోడించటం పై వైసీపీ శ్రేణులు షాక్ అయ్యారు. సజ్జల మాట్లాడుతున్నారు అంటూ, అది జగన్ గొంతే అని, జగనే ఇలా మాట్లడిస్తుంటే ఎలా అని షాక్ అవుతున్నారు. రేపు విజయమ్మ, షర్మిల ను కూడా జగన్ ఇలాగే అంటారు కదా అని, ఇన్నాళ్ళు జగన్ నిర్మించుకున్న క్రెడిబిలిటీ అనే పేక మేడ కుప్ప కూలి పోతుందని అంటున్నారు.