నారా లోకేష్ మొదటి సారి కోర్టు ముందు హాజరు అవుతున్నారు. లక్షల కోట్ల నేరాలు చేసి, లేదా బాబాయ్ ని వేసేసి కాదు, తన పైన చేసిన అబద్ధపు ప్రచారానికి, పరువు నష్టం దావా కేసులో. విశాఖ జిల్లాలో ఉన్న 12వ అదనపు కోర్టుకు లోకేష్ హాజరు అవుతున్నారు. గతంలో 2019లో సాక్షి దినపత్రికలో ఒక కధనం వచ్చింది. చినబాబు చిరు తిళ్ళు అంటూ రూ.25 లక్షల రూపాయలు నారా లోకేష్ ఖర్చు చేసారని, కేవలం చిరు తిళ్ళు కోసం ఖర్చు పెట్టారు అంటూ సాక్షిలో కధనం వచ్చింది. అయితే సాక్షి ఇక్కడే ఫేక్ చేస్తూ దొరికిపోయింది. లోకేష్ చిరు తిళ్ళు తిన్నారని, తేదీలు, లెక్కలతో సహా సాక్షి చూపించింది. అయితే ఆ తేదీల్లో, లోకేష్ అసలు అక్కడ లేరు. అక్కడ లేకుండానే, లోకేష్ పలానా చోట ఉన్నారని, అక్కడే చిరు తిళ్ళు కోసం ఖర్చు పెట్టారు అంటూ సాక్షి వేసింది. అయితే దీని పైన లోకేష్ టీం మొత్తం కసరత్తు చేసింది. సాక్షి వేసిన తేదీల్లో అసలు లోకేష్ ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు, ఇలా మొత్తం డీటెయిల్స్ బయటకు వదిలారు. ఆధారాలతో సహా లోకేష్ టీం బయటకు ఇచ్చింది. సాక్షి చేసిన ఫేక్ మొత్తం బయట పడింది. దీంతో లోకేష్ సాక్షికి లీగల్ నోటీస్ పంపించారు. దీని పైన తనకు వివరణ ఇవ్వాలని, సాక్షి దినపత్రికకు లోకేష్ లీగల్ నోటీసులు పంపించారు.
అయితే, లోకేష్, సాక్షి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెంద లేదు. సాక్షి పైన పరువు నష్టం దావా వేసారు. విశాఖలో తిన్నట్టు ఆరోపణలు చేయటంతో, సాక్షి పైన విశాఖ కోర్టులోనే పరువు నష్టం దావా వేసారు. అయితే ఈ కేసు ఇప్పుడు దాదపుగా మూడేళ్ళకు విచారణకు వచ్చింది. కరోనా వల్ల ఈ కేసు విచారణ లేట్ అయినట్టు చెప్తున్నారు. దాదాపుగా మూడేళ్ళ తరువాత ఈ కేసు విచారణకు వచ్చింది. సాక్షి పైన రూ.75 కోట్ల పరువు నష్టం దావా వేసారు. ఈ కేసు విషయంలోనే నారా లోకేష్ స్వయంగా కోర్టుకు హాజరు అవుతున్నారు. మొదటి సారి లోకేష్ కోర్ట్ ముందుకు హాజరు అవుతున్నారు. ఈ రోజు విజయవాడ నుంచి బయలుదేరి, లోకేష్ విశాఖ చేరుకుంటారు. అక్కడ కోర్టు పని ముగిసిన తరువాత, నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లనున్నారు. సాక్షి చేస్తున్న విష ప్రచారం పైన, లోకేష్ తీసుకున్న అడుగులతో, టిడిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాగే సాక్షి చేస్తున్న ప్రతి ఫేక్ పైన, పరువు నష్టం కేసులు వేయాలని కోరుతున్నారు.