వైఎస్ వివేక కేసులో ఈ రోజు దినపత్రికల్లో వచ్చిన వార్తలు సెన్సేషన్ క్రియేట్ చేసాయి. నిన్నటి వరకు ఈ కేసుని చంద్రబాబు మీదకు తోసిన వైసీపీ శ్రేణులు, నెమ్మదిగా అందరూ అవినాష్ రెడ్డి పేరు చెప్పటంతో, అవినాష్ రెడ్డిని వదిలించుకుంటే అయిపోతుందని భావించారు. అయితే అనూహ్యంగా ఈ రోజు వివేక కేసులో జగన్ పేరు కూడా తెర మీదకు రావటంతో, వైసీపీ శ్రేణులు హడలెత్తి పోతున్నాయి. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అని బెంబేలెత్తి పోతున్నారు. మరీ ముఖ్యంగా అవినాష్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ చేయటం ఖాయం అని, ఆ సమయంలో అవినాష్ రెడ్డి చెప్పే పేర్లు ఏమిటో అని హడలెత్తి పోతున్నారు. ముఖ్యంగా ఆ రోజు అవినాష్ రెడ్డి కాల్ డేటా చూస్తే, ఆయన ఎవరికి ఫోన్ చేసింది, బయట పడితే, ఇక గుట్టు మొత్తం బయటకు వస్తుందని, తమ పార్టీ పరిస్థితి ఏమిటి అని వారు కంగారు పడి పోతున్నారు. సిబిఐకి వివేక అల్లుడు, అంటే సునీత భర్త రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లో సంచలన విషయాలు ఉన్నాయి. వివేక కేసు విషయంలో తమకు జగన్ పైనకూడా అనుమానం ఉందని అన్నారు. కోడి కత్తి కేసు లాగే, ఈ కేసుని కూడా జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకుని ఎన్నికల్లో లాభ పడ్డారని కోర్టుకు తెలిపారు. మరీ ముఖ్యంగా జగన్ కోడి కత్తి కేసు విషయంలో జరిగిన విషయాలు ఇక్కడ చెప్పారు.

jagan 01032022 2

కోడి కత్తి అప్పుడు, హైదరాబాద్ వెళ్లి చికిత్స పేరుతో హడావిడి చేసారని, చికిత్స చేసిన ఇద్దరు డాక్టర్లకు, అధికారం వచ్చిన తరువాత పదువులు ఇచ్చారని సిబిఐకి తెలిపారు. అచ్చం కోడి కత్తితో ఎలా లబ్ది పొందారో, వివేక విషయం కూడా, ఆలాగే వాడుకుంటున్నారు అనే అభిప్రాయం తమకు ఉందని, జగనే ఇది చేపించారేమో అని సిబిఐకి తెలిపారు. ఈ కేసు విషయంలో, ఎన్నికల ముందు కనుక మాకు జగన్ మీద అనుమానం ఉంటే, అప్పుడే వారు ఎన్నికల్లో ఓడిపోయే వారని అన్నారు. వివేకా కేసుకు సంబంధించి, ఏమి చేస్తున్నారో, ఎప్పటికప్పుడు సజ్జలకు చెప్పాలని, విజయమ్మ, భారతి వచ్చి మాకు చెప్పారని అన్నారు. అయితే ఆ రోజు వివేక కేసు విషయాన్ని జగన్ రాజకీయంగా వాడుకుంటున్న తీరు మాకు నచ్చక, ఆ రోజే జగన్ వద్ద ఈ విషయం చెప్పామని అన్నారు. తాను గుండెనొప్పి అని చెప్పానని ప్రచారం చేస్తున్నారని, తాను ఎక్కడా గుండె నొప్పి అని చెప్పలేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ ను నీరుగార్చారని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read