జగన్ మోహన్ రెడ్డి చెల్లెల్లు వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడుతుంది అంటూ ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. షర్మిల కూడా స్పందిస్తూ, ఏ పార్టీ పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో ఉందా అంటూ కౌంటర్ ఇవ్వటంతో, షర్మిల ఏ క్షణమైనా ఏపిలో ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం మొదలైంది. అయితే షర్మిల పార్టీ పేరు వైఎస్ఆర్టీపి, అందులో తెలంగాణా పదం ఉంది. ఈ పేరు పెట్టుకుని షర్మిల ఏపిలో పార్టీ పెట్టటం కష్టం అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు షర్మిలకు ఆ బాధ కూడా తప్పింది. ప్రసుత్తం జరిగిన ఒక పరిణామంతో, షర్మిల తన పార్టీ పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి రావటంతో, ఏపిలో కూడా పార్టీ ఉండేలా, కొత్త పేరుతో షర్మిల వస్తున్నాట్టు తెలుస్తుంది. అసలు ఏమైంది అంటే, ఇప్పటికే షర్మిల వైఎస్ఆర్టిపి పేరుతో తన పార్టీ పేరు ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకోవటానికి ధరఖాస్తు చేసారు. అయితే షర్మిల పార్టిని ఎన్నికల కమిషన్ రిజిస్టర్ చేయకుండా, పార్టీ పేరు మార్చుకోవాలని తిప్పి పంపించింది. అప్పటి వరకు పార్టీ పేరుని రిజిస్టర్ చేయమని చెప్పింది.

దీనికి కారణం అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యంతరం. ఇప్పటికే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మహబూబ్ బాషా, షర్మిల పార్టీ పేరు పై ఎలక్షన్ కమిషన్ వద్ద అభ్యంతరం తెలిపారు. దీంతో ఆయనకు ఎలక్షన్ కమిషన్ స్పందిస్తూ, షర్మిల పార్టీ పేరుని రిజిస్టర్ చేయలేదని, కొత్త పేరుతో రమ్మని చెప్పినట్టు తెలిపారు. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి పార్టీ పేరు పైన కూడా అభ్యంతరం తెలిపింది. అది కూడా కోర్టులో ఉంది. ఇప్పుడు తాజాగా షర్మిల పార్టీ విషయంలో కూడా అభ్యంతరం తెలపటంతో, షర్మిల పార్టీ పేరు రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు షర్మిల కొత్త పేరు పైన కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఎలాగూ షర్మిల ఏపిలో కూడా అడుగు పెడుతున్నారు కాబట్టి, ఏపిలో కూడా పార్టీ ఉండేలా ఆమె, కొత్త పేరుతో రానున్నారని తెలుస్తుంది. మొత్తానికి షర్మిల పార్టీకి పేరు రిజిస్ట్రేషన్ లోనే అవాంతరాలు ఎదురైనా, ఆమె దీన్ని తనకు ఎలా అనుకూలంగా మలుచుకుంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read