నరసరావుపేట పేట టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్‍బాబు పై, రెండు రోజుల క్రితం, పోలీసులు వ్యవహరించిన తీరు అందిరకీ తెలిసిందే. ఒక కేసు విషయంలో, తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులను అక్రమంగా అరెస్ట్ చేసారని తెలుగుదేశం పార్టీ నిరసనకు పిలుపు ఇచ్చింది. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అరవింద్ బాబు పైన పోలీసులు గుండెల మీద తన్నటంతో, ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి చికిత్స అందించారు. అరవింద్ బాబు పైన దౌర్జన్యం చేసిన పోలీసులను అరెస్ట్ చేయాలని టిడిపి ఆందోళన చేస్తుంటే, తెలుగుదేశం పార్టీకే షాక్ ఇచ్చారు పోలీసులు. కొట్టి, హాస్పిటల్ లో చేరితే, ఆయనకు న్యాయం చేయకుండా, ఎదురు చదలవాడ అరవింద్‍బాబుపైనే కేసు నమోదు చేసారు పోలీసులు. జొన్నలగడ్డలో రోడ్డు మీద ఆందోళన చేపట్టి, అక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించారని, అందుకే కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ కూడా షాక్ కు గురయ్యింది. ఇదేమి తీరు అంటూ, తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసుల పై మండి పడుతున్నారు.

chadalawada 17012022 2

స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే, పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమంగా తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేసారని, దాని పై ప్రశ్నిస్తే, ఎదురు కేసులు పెట్టటం పై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క నరసరావుపేట పేట టీడీపీ ఇంచార్జ్ అరవింద్ బాబును, చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అవసరం అయితే, హాస్పిటల్ మార్చాలని సూచించారు. నిరసన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, చంద్రబాబు సూచించారు. అలాగే అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకుని వస్తున్న సమయంలో, వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని, అంబులెన్స్ ధ్వంసం చేయటం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోక పోవటం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read