అమరావతి పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిగా ఉంటుందా లేదా ? అమరావతితో పాటు మూడు రాజధానులు అంటూ జగన్ మోహన్ రెడ్డి గందరగోళం సృష్టిస్తున్న నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ, ఏపి రాజధాని అమరావతిగా నిర్ధారిస్తూ, అమరావతి కేంద్ర బడ్జెట్ లో కేటాయించింది. 2022-23 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉందని, ఏపి విభజన చట్టంలో పేర్కొన్న నేపధ్యంలో, రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పేరుతోనే, బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఇది పెట్టింది. కేంద్ర బడ్జెట్ లో అమరావతికి ఇచ్చిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి ఈ నిధులు కేటాయిస్తూ, బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్ల అంచనా వ్యయంగా కేంద్రం పేర్కొంది. అందులో కొంత మొత్తాన్ని ఇప్పటికే కేంద్రం విడుదల చేసిందని, మిగతాది ఈ బడ్జెట్ లో కేంద్రం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ లెక్కల్లో చెప్పింది.
అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం కూడా రూ.1,126 కోట్లుగా అంచనా వేసిన కేంద్రం, ఈ బడ్జెట్ లో కేంద్రం కొంత కేటాయించింది. అలాగే GPOAకి భూసేకరణ కోసం రూ.6.69 కోట్ల అంచనా వ్యయంగా, కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందులో 2020-21, 2021-22 బడ్జెట్లో మొత్తం రూ.4.48 కోట్లు కేంద్రం ఖర్చు చేసినట్టు ఈ బడ్జెట్ లో స్పష్టం చేసారు. ఉద్యోగ నివాస గృహాలకు సంబంధించి, వాటికి అవసరం అయిన భూ సేకరణకు కూడా, 2021-22లో రూ.21 కోట్లు అంచనా వేసి, ఇప్పటి వరకు రూ.18.3 కోట్లు ఖర్చు చేసామని కేంద్రం బడ్జెట్ లెక్కల్లో తెలిపింది. అలాగే ఎకౌంటు జనరల్ స్టాఫ్ క్వార్టర్స్ కు కూడా రూ.200 కోట్లు అంచనా వ్యయంగా కేంద్రం నిర్ధారించింది. ఇవన్నీ కూడా అమరావతిలోనే ఈ నిర్మాణాలు చేపట్టటానికి కేంద్రం ఈ నిధులు కేటాయించింది. పట్టాభివృద్ధి శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ లో ఈ విషయాలు అన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా కేంద్రం, ఇప్పుడు అమరావతినే రాజధానిగా గుర్తించటంతో, వైసీపీకి షాక్ తగిలింది అనే చెప్పాలి.