జగన్ మార్క్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందో, ఈ మధ్య గౌతం సవాంగ్ ని చూసిన అందరికీ అర్ధం అవుతంది. వాడుకుంటారు, వాడుకుంటారు, వాడుకుంటారు, చివరకు లాచి ఒకటి పీకుతారు. ఇది గౌతం సవాంగ్ ఒక్కడి విషయంలోనే కాదు, అంతకు ముందు ఎల్వీ సుభ్రమణ్యం, అలాగే పీవీ రమేష్, ఇలా అనేక మంది అధికారులను వాడుకుని, వదిలేయటంతోనే అయిపొయింది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో జాస్తి నాగభూషణ్ చేరారు. ఆయనతో ఇక అవసరం లేదు అనుకున్నారో, లేదా మరే కారణమో కానీ, నెత్తిన పెట్టుకున్న వారే, ఇప్పుడు ఇంటికి పంపించి పడేయటంతో, జగన్ మార్క్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మరోసారి అర్ధం అవుతుంది. జాస్తి నాగభూషణ్, మాజీ సుప్రీం కోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్ కుమారుడు. ఈయనకుదాదపుగా రెండేళ్ళ క్రితం రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. అయితే ఈ నియామకం పై అప్పట్లోనే అనేక చర్చలు జరిగాయి. ఆ తరువాత, ఈయనకు ఇష్టం వచ్చినట్టు పేమెంట్ లు ఇస్తూ, జీవోలు ఇవ్వటం పైన కూడా చర్చ జరిగింది. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా, జాస్తి నాగభూషణ్ ను ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంది. అప్పట్లో వాళ్ళ అవసరాలు అలా ఉండేవి మరి. ఇప్పుడు ఈయనతో అవసరం లేదు అనుకున్నారో ఏమో కానీ, ఇపుడు పొగ బెట్టి సాగనంపారు.
అప్పట్లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే జస్టిస్ ఎన్వీ రమణ పైన, జాస్తి చలమేశ్వర్ సాయంతోనే, జగన్ ప్రభుత్వం , ఎన్వీ రమణ పైన ఎదురు దా-డి చేసింది అనే ప్రచారం ఉంది. జడ్జిల మీద ఫిర్యాదులు చేయటంలో, ఈయన సహాయం తీసుకున్నారు. ఆ సమయంలోనే జాస్తి చలమేశ్వర్ కుమారుడికి, పదవి ఒకటి కల్పించి మరీ ఇచ్చారు. ఈయన ఎక్కువగా ఢిల్లీలో ఉంటూ, జగన్ వ్యవహారాలు చక్క బెట్టే వారు. నేరుగా సియం ఆఫీస్ కు వెళ్ళేంత చనువు పొందారు. అయితే ఏమైందో ఏమో కానీ, ఈ మధ్య కాలంలో జాస్తి నాగభూషణ్ ను పక్కన పెడుతూ వచ్చారు. సియం ఆఫీస్ లోకి ఎంట్రీ కూడా లేకుండా పోయింది. కేసులు కూడా ప్రభుత్వం తరుపున ఏమి ఇవ్వటం లేదు. వీటి అన్నిటిని నేపధ్యంలో, తనకు జరిగిన అవమాన భారాన్ని భరించ లేక, జాస్తి నాగభూషణ్ నిన్న తన పదవికి రాజీనామా చేసారు ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వొకేట్ జనరల్ పదవికి రాజీనామా చేసారు. జగన్ మోహన్ రెడ్డి వాడుకుని వదిలిసేన జాబితాలో, ఈయన కూడా చేరిపోయారు.