ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కోవిడ్ సెంటర్లకు, గతంలో ఆహరం సప్లై చేసిన కాంట్రాక్టర్లకు, సంబంధిత బిల్లులు అందలేదని, హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. ఆ పిటీషన్ కు సంబంధించి, ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో విచారణ జరిగిన సందర్భంలో, దీనికి సంబందించిన అధికారులు తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీంతో ఈ రోజు కోర్టు ఆదేశాలు ప్రకారం, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఇద్దరూ ఈ రోజు హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు అయ్యారు. హైకోర్టుకు హాజరయిన అధికారులు, బిల్లులు చెల్లించినట్టు కోర్టుకు చెప్పారు. అదే విధంగా బిల్లులు చెల్లింపులు ఆలస్యం అయినందుకు కోర్టుకు క్షమాపణలు కూడా చెప్పారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం, అసలు ఎందుకు బిల్లులు చెల్లించటం ఆలస్యం అయ్యింది ? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాలి, ఇలాంటి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలి అంటూ, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ బిల్లుల వివరాల సమర్పణకు సమయం కావాలని కోరటంతో, తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేస్తూ, పూర్తి వివరాలు తమకు చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది.

hc 11032022 2

ముఖ్యంగా చూసుకుంటే, కోవిడ్ సమయంలో, తాము ప్రభుత్వం అడిగినట్టు ఆహరం సప్లై చేసాం అని, అయితే ప్రభుత్వం వైపు నుంచి తమకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం అయ్యిందని, ఇబ్బందులు పెడుతున్నాం అంటూ, పిటీషనర్ తరుపున న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. అయితే దీని పైన హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎందుకు బిల్లులు చెల్లించ లేదు అంటూ, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు అధికారులు తమ ముందుకు రావాలని కోర్టు ఆదేశించటంతో, ఈ రోజు కోర్టు ముందుకు వచ్చిన అధికారులు, ఆలస్యానికి కారణాలు కోర్టుకు చెప్తూ, చెల్లింపుల వివారాలు చెప్పారు. అయితే కోర్టు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని కోరింది. అయితే ఈ సందర్భంలో అధికారులను కోర్టు ఒక ప్రశ్న అడిగినట్టు తెలుస్తుంది. మీరు ఏదైనా హోటల్ కు వెళ్లి, మొత్తం తినేసి, బిల్లు తరువాత కడతాను అంటే ఎలా ఉంటుంది ? అని కోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు మరోసారి అధికారులు కోర్టు మెట్లు ఎక్కారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read