ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పైన, నిప్పులు చెరిగింది. చెల్లింపులో ఆలస్యం పైన, చీఫ్ సెక్రటరీని కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టుకు వచ్చిన చీఫ్ సెక్రటరీతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వాయించి పడేసింది. బిల్లులు చెల్లింపులో జాప్యం పైన విచారణ జరుగుతూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ సెక్రటరీని హైకోర్టు ప్రశ్నిస్తూ, మీరు త్వరలో రిటైర్డ్ అవ్వబోతున్నారు కదా, ఎక్కడ స్థిరపడాలని ప్లాన్ చేసారు అంటూ, హైకోర్టు ఆయన్ను ప్రశ్నించింది. దానికి సమాధానం ఇచ్చిన చీఫ్ సెక్రటరీ, తాను హైదరాబాద్ తో పాటుగా, ఇతర మెట్రో నగరాల పేర్లు చెప్పి, అక్కడ స్థిరపడాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. దీనికి స్పందించిన హైకోర్టు, మీతో పాటు చాలా మంది ఉన్నతాధికారులు అలాగే కోరుకుంటున్నారు అని, అయితే హైకోర్టు జడ్జిగా, ఇక్కడ రాష్ట్ర పౌరుడిగా నేను, అలాగే ఇక్కడ ప్రజలు, చివరి దాకా ఇక్కడే ఉండాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన రాష్ట్రంలో చాలా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. చిన్న చిన్న అవసరాలు కూడా రాష్ట్రంలో తీరని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మౌళిక అంశమైన వైద్యం కూడా, ఇక్కడ దక్కటం లేదని అన్నారు.

hc 10032022 2

వైద్యం కావాలి అంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని, పెద్ద పెద్ద అధికారులు, ఆర్ధికంగా బలంగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ వెళ్లి వైద్యం చేపించుకుంటున్నారని, మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కరోనా సమయంలో చూసాం కదా, హైదరాబాద్ కు అంబులెన్స్ లు బారులు తీరాయి, చివరకు అక్కడ ప్రభుత్వం మన అంబులెన్స్ లను రావటానికి ఒప్పుకోక పోవటంతో, వివాదం ఏర్పడింది, అని గుర్తు చేసారు. నిన్న హైదరాబాద్ మన రాజధాని అని చెప్పిన వారు అప్పుడు ఏమయ్యారు, అంబులెన్స్ లు కూడా అనుమతి ఇవ్వక పోతే ఏమి చేసారు అంటూ, బొత్సా వ్యాఖ్యల పైన పరోక్షంగా స్పందించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సరైన సలహాలు ఇవ్వకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు సరైన సలహాలు ఇచ్చి, ప్రభుత్వాన్ని మంచి దారిలో నడిపించాలని హైకోర్ట్ పేర్కొంది. అయితే గత రెండు రోజులుగా హైదరాబాద్ రాజధాని అంటూ బొత్సా చేసిన వ్యాఖ్యల పై, హైకోర్టు పరోక్షంగా చురకలు అంటించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read