ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా ముఖ్యమైనది. అధికార పక్షానికి ఎన్ని బాధ్యతు ఉంటాయో, ప్రతిపక్షానికి కూడా అన్నే బాధ్యతలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే పనిలో పడింది. ప్రతిపక్ష నాయకులు గట్టిగా మాట్లాడితే కేసులు, ప్రతిపక్ష నాయకులు ఆందోళనలు చేస్తాం అంటే హౌస్ అరెస్ట్ లు. బలంగా ఉండే ప్రతిపక్ష నాయకుల పై కేసులు, వేధింపులు. ఇదే ధోరణి అసెంబ్లీలో కూడా కొనసాగింది. అయితే అసెంబ్లీలో చంద్రబాబు టార్గెట్ గా ఆయన అవమానాలు పడేలా వైసీపీ వ్యహరించింది. చంద్రబాబుని పెర్సనల్ గా టార్గెట్ చేసారు. అయినా చంద్రబాబు తొణకలేదు బెనకలేదు, కుప్పంలో దొంగ ఓట్లతో, రిగ్గింగ్ తో, అధికార బలంతో, మునిసిపల్ ఎన్నికల్లో గెలిచిన తరువాత, చంద్రబాబుని అసెంబ్లీలో మరింత కుంగదీయాలని వైసీపీ ప్లాన్ చేసింది. అయితే చంద్రబాబు మాత్రం, ఎక్కడా వీరి ఉడత ఊపులకు వెనక్కు తగ్గలేదు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, కుప్పం కాకపొతే పులివెందుల నుంచి మొదలు పెడదాం, బాబాయ్ కేసు నుంచి మొదలు పెడదాం అని, దీటుగా సమాధానం చెప్పారు. అంతే వైసీపీకి ఏమి చేయాలో అర్ధం కాలేదు. చంద్రబాబు ఇంత బలమైన వాడని వైసీపీ ఊహించలేక పోయింది. అందుకే చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టలేం అని పర్సనల్ గా టార్గెట్ చేసింది.

tdp 06032022 2

బూతుల మంత్రులు, కొంత మంది బూతుల ఎమ్మెల్యేల చేత, సభ్య సమాజం మాట్లాడని భాషను, అసెంబ్లీలో ఉపయోగించేలా చేసి, చంద్రబాబు సతీమణిని నిండు సభలో అవమానించారు. అంతే, అప్పటి వరకు బలంగా ఉన్న చంద్రబాబు, ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ నాడు లేని విధంగా, చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్య శీలాన్ని, అన్న గారి కూతురు శీలాన్ని నిండు సభలో శంకించిన కౌరవ మూకల మధ్య నేను ఉండనని, ఈ కౌరవ సభలోకి, మళ్ళీ సియంగానే గౌరవ సభ చేసి వస్తానని, శపధం చేసారు. అయితే ఇప్పుడు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపధ్యంలో, టిడిపి మిగతా ఎమ్మెల్యేలు సభకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో వైసీపీ రెండేళ్ళు సభలో లేకుండా, ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. టిడిపి ఇప్పుడు వైసీపీలా తప్పు చేయదలుచుకోలేదు. చంద్రబాబు తప్ప మిగతా ఎమ్మెల్యేలు సభకు వెళ్ళాలని, వెళ్ళక పోతే వైసీపీ మరింత రెచ్చిపోతుందని, అమరావతి , పోలవరం, రైతుల సమస్యలు, ధరల పెరుగుదల, ఆర్ధిక పరిస్థితి, ఇలా అనేక సమస్యలను సభలో ప్రస్తావించాలని టిడిపి నిర్ణయించింది. వైసీపీ కంటే, తాము భిన్నం అని టిడిపి నిరూపించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read