జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, 2012 నుంచి సాగుతూ ఉన్న విషయం తెలిసిందే. తండ్రి అధికారంలో ఉండగా, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కూడబెట్టారు అంటూ, సిబిఐ 12 కేసులు, ఈడీ 5 కేసులు పెట్టింది. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ఈ కేసులు విషయంలో 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. తరువాత కండీషనల్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తరువాత సియం అయిన విషయం తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి కేసులు, 2012 నుంచి ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ఎక్కడా ఇంకా ట్రైల్స్ కు రాలేదు. సిబిఐ, ఈడీ కూడా ఈ కేసులు విచారణ పై తగు చర్యలు తీసుకోవటం లేదు. కేసులు పెట్టి పదేళ్ళు అవుతున్నా, ఇంకా ఈ కేసులు ట్రైల్స్ కు ఎందుకు రాలేదో ఎవరికీ అర్ధం కాదు. వివిధ రకాల పిటీషన్లు వేసి, కేసుని సాగదీస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ కేసులు విషయం తేల్చటానికి వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు రంగంలోకి దిగారు. దాదపుగా పది నెలలు క్రితమే, రఘురామకృష్ణం రాజు, జగన్ మోహన్ రెడ్డికి చెందిన సిబిఐ, ఈడీ కేసుల విచారణ జాప్యం పైన, తగిన ఆదేశాలు ఇవ్వాలి అంటూ, తెలంగాణా హైకోర్టు ముందు పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ దాఖలు చేసి కూడా, దాపుగా పది నెలలు పైన అవుతుంది.

tg 08032022 2

అయితే అనూహ్యంగా ఈ పిటీషన్ మాత్రం విచారణకు రావటం లేదు. ఎందుకు విచారణకు రావటం లేదో అర్ధం కావటం లేదని పలు సందర్భాల్లో రఘురామరాజు వ్యాఖ్యానించారు కూడా. ఇప్పటికీ ఈ కేసు విచారణ లిస్టింగ్ కూడా అవ్వక పోవటంతో, రఘురామకృష్ణం రాజు తెలంగాణా హైకోర్టుని ఆశ్రయించారు. జగన్ మోహన్ రెడ్డికి చెందిన అక్రమ ఆస్తుల కేసు, ఎందుకు విచారణ రావటంలోదో చూసి, ఆ కేసు గురించి చూడాలని హైకోర్టుని అభ్యర్ధించారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ, రఘురామరాజు వేసిన పిటీషన్ కు నెంబర్ కేటాయించాలని, లిస్టింగ్ కు వచ్చేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని రిజిస్ట్రీ చెప్పగా, వాటిని హైకోర్టు తోసి పుచ్చింది. అభ్యంతరాలతోనే హైకోర్టు ఈ పిల్ కు అనుమతి ఇస్తూ, నంబర్ కేటాయించాలని కోరింది. ఒక్కసారి నెంబర్ వచ్చి విచారణకు రాగానే, విచారణ అర్హత నిర్ణయించి, దీని పైన తదుపరి విచారణ జరపనుంది హైకోర్టు. మొత్తం మీద, రఘురామరాజు మాత్రం, జగన్ ని వదిలే ప్రసక్తే లేదని ఆయన వైఖరిని చూస్తే అర్ధం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read