ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం జరిగింది. గత రెండేళ్లుగా కరోనా ఉండటంతో, గవర్నర్ ప్రసంగం ఆన్లైన్ లోనే జరిగింది. మొదటి సారి గవర్నర్ అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వినిపించారు. అసెంబ్లీ, శాసనమండలి సభ్యులు కలిసి ఈ ప్రసంగం విన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే నిరసన తెలిపింది. గవర్నర్ గో బ్యాక్ నినాదాలు చేసింది. రాష్ట్రంలో అనేక రాజ్యాంగ సంస్థల విధ్వంసం జరుగుతున్నా, గవర్నర్ వాటిని కాపాడే ప్రయత్నం జరగలేదని, టిడిపి గవర్నర్ ప్రసంగానికి అడ్డు పడి, నిరసన తెలిపింది. ఇక ఇక్కడ మరో అంశం, గవర్నర్ ప్రసంగం. సహజంగా గవర్నర్ ప్రసంగం అంటే, ప్రభుత్వం చేసే కార్యకరమాలు అన్నీ గొప్పగా గవర్నర్ చేత చెప్పిస్తారు. ముందుగా గవర్నర్ ప్రసంగాన్ని క్యాబినెట్ లో ఆమోదిస్తారు. అయితే గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే, అందరికీ ఆశక్తి మూడు రాజధానుల గురించి ఏమి చెప్తారా అని. గత రెండేళ్లుగా గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల విషయం చెప్పించారు. అయితే ఇప్పుడు అమరావతి విషయంలో రైతులు కోర్టుకు వెళ్ళటం, సుదీర్ఘ వాదనల అనంతరం, కోర్టు ఈ విషయంలో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పు పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కొంత మంది కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మాట్లాడారు. చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నాడు అంటూ ఆపాదించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసెంబ్లీ హక్కులను న్యాయస్థానం హరిస్తుందని, దీని పైన అసెంబ్లీలో చర్చ పెట్టాలి అంటూ, ధర్మాన లేఖ రాసారు. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో ఏదో ప్లాన్ చేస్తుందని, అసెంబ్లీ వేదికగా న్యాయ వ్యవస్థ పైన దా-డి చేస్తారని అందరూ భావించారు. దీనికి టీజర్ గా గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల విషయం ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన తేలేదు. వికేంద్రీకరణ పాలన అంటూ కొత్త జిల్లాల గురించి చెప్పారు కానీ, ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన చేయలేదు. దీంతో ప్రభుత్వం బయట మీడియా ముందు చేస్తున్న హడావిడికి, లోపల చేస్తున్న దానికి పొంతన లేదు అనేది అర్ధం అవుతుంది. కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏమి చేసే సాహసం చేయలేదు, బయటకు మాత్రం రాజకీయంగా ఉపయోగపడటానికి మూడు రాజధానులు అంటూ బిల్డ్ అప్ మాత్రం ఇస్తున్నారు.