కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వినిపించే, సిబిఐ, ఈడీ దా-డు-లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విని చాలా రోజులు అయ్యింది. అయితే ఈ రోజు ఏకంగా, ఏక కాలంలో 40 చోట్ల సిబిఐ దా-డు-లు జరుగుతున్న వార్తలు విని ఏపి ఉలిక్కి పడింది. ఏపిలో ప్రావిడెంట్ ఫండ్ స్కాం జరిగినట్టు సిబిఐకి సమాచరం రావటంతో, ఏపిలోని అన్ని  ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల్లో సిబిఐ సోదాలు చేసారు. మొత్తం 40 చోట్ల ఈ సోదాలు జరిగాయి. కొంత మంది ఉన్నాతాధికారులు ఈ స్కాంలో భాగస్వామ్యమై ఉన్నారని, ప్రైవేటు సంస్థలతో, అధికారులు కుమ్మక్కు అయ్యి, భారీగా అక్రమాలకు పాల్పడినట్టు సిబిఐ గుర్తించింది. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ క్లియరెన్స్ కోసం వస్తున్న వారి దగ్గర నుంచి భారీగా లంచాలు తీసుకుని కానీ క్లియర్ చేయటం లేదని, ఈ లంచాల కోసం డిజిటల్ యాప్స్ ఉపయోగిస్తున్నట్టు సిబిఐ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా, గుంటూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, గుంతపల్లి లాంటి ప్రాంతాల్లో సిబిఐ సోదాలు జరిగాయి. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేసారు. ఇప్పటికీ పై స్థాయి ఉన్నతాధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు కొనసాగుతున్న. దీని వెనుక రాజకీయ నేతల హస్తం పై కూడా సిబిఐ ఆరా తీస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read