చింతామణి నాటకం నిషేధంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చింతామణి నాటకానికి సంబంధించి, ఉమేష్ చంద్ర అనే న్యాయవాది, వైసీపీ ఎంపీ రఘురామరాజు తరుపున హైకోర్టులో, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. ఈ ప్రజా ప్రయోజన పిటీషన్ పైన, ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని, ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చింతామణి నాటకం పై అభ్యంతరం ఉంటే, నాటకంలో ఏ పాత్ర పైన అభ్యంతరం ఉందో ఆ పాత్ర పైన నిషేధం విధించాలి కానీ, మొత్తం నాటకాన్ని ఎలా నిషేదిస్తారు అని చెప్పి, హైకోర్టు ప్రశ్నించింది. అలాగే మరో కీలకమైన అంశం ఏమిటి అంటే, ఈ చింతామణి నాటకానికి మూలం ఎక్కడ ఉంది, అనే విషయం పైన కూడా హైకోర్టు ఆరా తీసింది. అయితే ఈ నాటకం ఒక పుస్తకం ఆధారంగా వచ్చిందని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు మాట్లాడుతూ, ఆ పుస్తకాన్ని మీరు నిషేదించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పుస్తకాన్ని మేము నిషేదించలేదని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అసలు ఈ నాటకానికి మూలం అయిన పుస్తకాన్ని నిషేధించ కుండా, నాటకాన్ని ఎలా నిషేదిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

hc 020202022 2

ఈ నేపధ్యంలోనే దీనికి సంబంధించి, ఆర్య వైశ్యులు తమకు విజ్ఞాపన పత్రం ఇచ్చారని, దాని ఆధారంగానే, అది పరిగణలోకి తీసుకుని, నిషేధించామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. అసలు వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రం ఏమిటో తమ ముందు ఉంచాలని, హైకోర్టు ఆదేశించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొన్న ప్రభుత్వంతో పాటు, మిగతా ప్రతివాదులు అందరికీ కూడా కౌంటర్ ఫైల్ చేయాలని, ధర్మాసనం ఆదేశించింది. ఎప్పుడైనా సరే ఒక అంశాన్ని నిషేధించే సమయంలో, దాని వాళ్ళ ఎవరు ఎవరు ఇబ్బంది పడతారు అనే విషయం కూడా చూసుకోవాలని, న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టు ముందు వాదించారు. పైగా మూలమైన పుస్తకాన్ని కాకుండా, నాటక ప్రదర్శన నిషేదించటం ఎక్కడా లేదని కూడా కోర్టుకు తెలిపారు. న్యాయవాది వాదనతో ఏకీభవించి, పలు కీలక ప్రశ్నలు లేవనెత్తటమే కాకుండా, అసలు మీకు ఆర్య వైశ్యులు ఏమి విజ్ఞాపన పత్రం ఇచ్చారో, అది కూడా తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read