ఆంధ్రప్రదేశ్ రాజధాని పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు రాజ్యసభ సాక్షిగా స్పష్టం చేసారు. ఈ రోజు రాజ్యసభలో ప్రశ్నలు అడిగే సమయంలో, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఏపి రాజధానికి సంబంధించి సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే అని తాము అనుకుంటున్నాం అని, అయితే కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు అమరావతి కాకుండా, హైదరాబాద్ అని పేర్కొనటం, ఇతర ప్రాంతాలు గురించి చెప్పటం చూస్తున్నాం అని, అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏపి రాజధాని అంటే ఏది అంటూ సూటిగా ప్రశ్న వేసారు. దీని పైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇస్తూ, అమరావతి మాత్రమే ఇప్పటికే ఏపి రాజధాని అని, గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉండగా, అమరావతిని రాజధాని చేసారని అన్నారు. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పారని, అయితే ఈ బిల్లులు ఇప్పుడు లేవని అన్నారు. ఇప్పటికీ అమరావతి మాత్రమే ఏపి రాజధాని అని స్పష్టం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read