ఈ రోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు చేసిన చలో విజయవాడ కార్యక్రమం, సూపర్ సక్సెస్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త పీఆర్సి విషయంలో కోత పెట్టటంతో, ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎక్కడైనా పీఆర్సి పెరుగుతుంది కానీ ఇక్కడ తగ్గించారు. చంద్రబాబు 43 శాతం పీఆర్సి ఇచ్చారు. తరువాత పీఆర్సి ఇవ్వాల్సి ఉండగా, ఐఆర్ 27 శాతం ఇచ్చారు. అయితే కొత్త పీఆర్సి ఈ ఐఆర్ కంటే తక్కువగా 23 శాతం మాత్రమే ఇచ్చారు. దీంతో ఉద్యోగులకు దిమ్మ తిరిగింది. అలాగే హెచ్ఆర్ఏ కూడా 20 శాతం నుంచి 8 శాతానికి తగ్గించారు. ఎక్కడైనా జీతాలు పెరుగుతాయి కానీ, ఇక్కడ తగ్గాయి. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నష్టం జరిగింది. దీంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ ఉద్యమ కార్యాచరణలో భగంగా ఈ రోజు చలో విజయవాడ పిలుపు ఇచ్చారు. అయితే నిన్నతే నుంచే ప్రభుత్వం, నిర్బందిస్తూ వచ్చింది. ఎక్కడికక్కడ ఉద్యోగులను , టీచర్లను అరెస్ట్ చేస్తూ వచ్చారు. 13 జిల్లాల నుంచి అరెస్ట్ లు జరిగాయి. రైల్వే స్టేషన్ లో, బస్ స్టేషన్ లో, ఎక్కడికక్కడ ఆపేశారు. చివరకు బస్సులు, టాక్సీ డ్రైవర్ లకు కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ కార్యక్రమం ఫ్లాప్ అవుతుందని, అందరూ భావించారు.
అయితే ఏమైందో ఏమో కానీ, ఉదయం 9 వరకు మొత్తం తమ కంట్రోల్ లో ఉందని, పోలీసులు భావించారు. అయితే ఉన్నట్టు ఉండి, పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా ఉద్యోగులు వేలాదిగా రోడ్డుల పైకి వచ్చారు. దీంతో పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేక పోయారు. చేతులు ఎత్తేసారు. ఉద్యోగులు అనుకున్న విధంగా బీఆర్టీఎస్ రోడ్డుకు వచ్చి, ర్యాలీ చేసి, మీటింగ్ పెట్టారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా, అసలు ఉద్యోగులు వ్యూహం ఏంటో పోలీసులు తెలుసుకోలేక పోయారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పెద్దిరెడ్డి పన్నిన వ్యూహమే ఇక్కడ ఉద్యోగులు పన్నారు. పెళ్లి బస్సులు పేరుతో, బ్యానర్ లు కట్టుకుని, బస్సులు వేసుకుని ఉద్యోగులు వచ్చేసారు. అలాగే మారు వేషాల్లో, రైతులు, పూజారుల వేషాల్లో ఉద్యోగులు వచ్చారు. ఒకేసారి అందరూ వ్యూహం ప్రకారం రావటంతో, ఇంత మంది ఎక్కడ నుంచి వచ్చారో పోలీసులకు అర్ధం కాలేదు. మొత్తానికి పెద్దిరెడ్డి తిరుపతిలో ఉపయోగించిన ఫార్ములాతో, ఉద్యోగులు ఇక్కడ కూడా సక్సెస్ అయ్యారు.