‘నన్ను కొంతమంది అడిగారు. మేము పెట్టుబడులు పెట్టాక రాజకీయ సమీకరణాలు మారితే మా పరిస్థితి ఏమిటి? అని’. ‘నేనొకటే చెప్తున్నాను. మీకా భయం లేదు, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితి ఉత్పన్నం కాదు. మేం దీర్ఘకాల వ్యూహాలతో పని చేస్తున్నాం. ఎనభై శాతం ప్రజా సంతృప్తి లక్ష్యంగా పాలన అందిస్తున్నాం. మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం, అత్యధిక మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తామని’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అబుదాబీలో ఐబిపిజి (IBPG), ఐసిఏఐ (ICAI)ల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గత ఎన్నికలలో 1.6 % మెజారిటీతో గెలిచామని, ఇటీవల నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 16% అధికంగా వచ్చాయని, 57 % ఓట్స్ షేర్ సాధించామని, ఈ శాతాన్ని 80%కు తీసుకువస్తామని చెప్పారు. ప్రజల్లో 80% సంతృప్తి తీసుకొస్తున్నాం, రాజకీయ సుస్థిరతకు ఢోకా లేదు.

ఆ నమ్మకం తమకు ఉందని, ఇన్వెస్టర్లు నమ్మకంతో రావాలని, సుస్థిర ప్రభుత్వం ఉంటుందని, మళ్లీ తాము అధికారంలోకి రావటం తధ్యమని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ‘మీ పెట్టుబడులకు నాదీ భరోసా’ అని సభికుల కరతాళ ధ్వనుల మధ్య చంద్రబాబు స్పష్టం చేశారు.విద్యుత్ రంగంలో 22 మిలియన్ యూనిట్ల లోటుతో ప్రారంభం అయ్యామని, కేవలం 2 నెలల్లో మిగులు విద్యుత్ సాధించినట్లు చంద్రబాబు చెప్పారు. విద్యుత్ రంగంలో రెండవతరం సంస్కరణలకు వెళుతూ, సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. విద్యుత్ రంగంలో తాము దేశానికే ఆదర్శంగా నిలిచామని, మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీలో అపార అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ‘మీరందరూ వాటిని అందిపుచ్చుకోవాలని కోరుతున్నా.నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంది. అమరావతిని కేవలం పాలనా నగరంగానే కాక నాలెడ్జ్,ఆర్థిక నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికే ప్రఖ్యాత విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు అమరావతికి వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. పదహారు మెడికల్ కాలేజీలు వచ్చాయి. మరే సిటీకి ఇటువంటి సదుపాయాలు లేవని, అర్బన్ ట్రాన్సపోర్టేషన్ శ్రద్ద పెట్టినట్లు, అరగంటలో ఎక్కడినుంచి ఎక్కడికైనా వెళ్లేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, ఎలక్ట్రికల్ రవాణా వ్యవస్థ నెలకొల్పుతున్నట్లు చంద్రబాబు వివరించారు.

రియల్ టైం గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నాం. 1500 మందితో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 డాలర్ల కంటే తక్కువకే ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ అందిస్తున్నట్లు ప్రతి ఇల్లూ ఒక నాలెడ్జ్ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. రూ 5,000 కోట్ల వ్యయం కాగల ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ తన వినూత్న ఆలోచన వల్ల రూ 320 కోట్లకు తగ్గించగలిగినట్లు సీఎం చెప్పినప్పుడు సభికులు కరతాళ ధ్వనులు చేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరితో విడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతానని చెప్పారు. ‘ థింక్ అబౌట్ ఇండియా. భారత్ కు గొప్ప భవిష్యత్తు ఉంది. పెట్టుబడి పెట్టే వారికి ఆహ్వానం. ఇండియా రండి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి. ‘మనీ ఈజ్ నాట్ ఇస్యూ‘, మేకిన్ ఇంధ్రప్రదేశ్.. ‘మీకే సందేహాలున్నా వదిలేయండి,ఆంద్రప్రదేశ్ లో మా ప్రభుత్వం ఉంది. ఆంద్రప్రదేశ్ మీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం’ అని చంద్రబాబు అన్నారు.

ఇప్పటికే ఒకసారి పాదయత్ర తేదీ మార్చుకున్న జగన్, మరో సారి పాదయాత్ర స్టార్ట్ చేసే తేదీ మార్చారు... ఇంతకు ముందు అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తాను అని గుంటూరులో అతి పెద్ద మీటింగ్ పెట్టి, హడావిడిగా ప్రకటన చేసిన జగన, జోతిష్యులు ఆ టైం బాగోలేదు అని చెప్పారని, నవంబర్ రెండుకు వాయిదా వేశారు... దీనికి తగ్గట్టుగా ప్రచార మెటీరియల్ కూడా రెడీ అయ్యింది... అయితే నిన్న కోర్ట్ తీర్పు నేపధ్యంలో మరోసారి, పాదయాత్ర తేది మార్చాడు జగన్..

padayatra 24102017 2

ముందుగా అనుకునట్టు నవంబర్ రెండు నుంచి కాకుండా, నవంబర్ 6 నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు... ఇప్పటికైతే ఇది సమాచారం.. మళ్ళీ డేట్ మారుతుందా అనేది చూడాలి... ఈ తేది మార్చటానికి ప్రధాన కారణం, నిన్న వచ్చిన కోర్ట్ తీర్పు అంటున్నాయి, వైసిపి వర్గాలు... శుక్రువారం కోర్ట్ కి రాను అని జగన్ పిటీషన్ పెట్టుకుంటే, అది కుదరదు ప్రతి శుక్రువారం కోర్ట్ కి రావాలి అని సిబిఐ కోర్ట్ చెప్పిన విషయం తెలిసిందే... ఇదే ఇప్పుడు జగన్ కు ఇబ్బంది అయింది... ఎందుకంటే ఆర్భాటంగా నవంబర్ 2న పాదయాత్ర మొదలు పెడితే, ఆ రోజు గురువారం అవుతుంది... కోర్ట్ ఆదేశించింది కాబట్టి, నవంబర్ 3 శుక్రువారం కోర్ట్ కి హాజరు కావాల్సిందే... లేకపోతే అసలకే మోసం వచ్చి, బెయిల్ కూడా రద్దు అయ్యే ప్రమాదం ఉంది... అలా అని పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత రోజే కోర్ట్ కి వెళ్తే, ప్రజల్లో చులకని అవుతారు అని సీనియర్లు చెప్పటంతో, జగన్ పాదయాత్ర తేది మార్చారు అని అంటున్నాయి పార్టీ వర్గాలు...

padayatra 24102017 3

ఇలా డైరెక్ట్ గా చెప్తే పరువు పోతుంది అని, వైసిపి మీడియాకి వేరే రకంగా చెప్పింది. జగన్ షడ్యుల్ ఇలా ఉండబోతుంది.. వచ్చే నెల 3వతేదీ ఉదయం కోర్ట్ కు హాజరు అయిన తరువాత, సాయంత్రం తిరుమలకు జగన్ చేరుకుంటారు. అనంతరం 4వతేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే 5వతేదీన కడప పట్టణంలోగల దర్గాను దర్శిస్తారు. అనంతరం పులివెందులకు చేరుకుని చర్చిలో ప్రార్ధనలు చేస్తారు. అనంతరం నవంబర్ 6 నుంచి, ఇడుపులపాయకు చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.

ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో, కనిపించిన స్వామీజీల అందరి ఆశీర్వాదం తీసుకుంటున్న జగన్, ఇప్పుడు రూట్ మార్చి పత్రికలు, టీవీ ఛానెళ్ల సిఈఓల పై పడ్డారు... జగన్, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయం నుంచి, ద్వేషిస్తూ వస్తున్న ఆ రెండు పత్రికల్లో ఒకటైన ఈనాడు రామోజీరావుని ఇప్పటికే రెండు సార్లు కలిసిన జగన్, నిన్న మరో మారు, రామోజీతో భేటీ అయ్యారు... తన కేసులు, బీజేపీతో పొత్తుకు గల అవకాశాలు, అన్నిటికీ మించి ఆశీర్వాదం తీసుకున్నారు... ఒక్క రోజు అయినా నిన్ను జైలుకి పంపిస్తా రామోజీ అని ఛాలెంజ్ చేసిన జగన్, ఇప్పుడు రివర్స్ లో ఆయన ఆశీర్వాదం తీసుకోవటానికి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు...

abn rk jagan 24102017 2

అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పత్రికలు, టీవీ ఛానెళ్ల సిఈఓలతో జగన్ సమావేశం ఏర్పాటు చేశారు... నవంబర్ రెండు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో అందరి సపోర్ట్ నాకు కావాలని, మీరందరూ నన్ను ముఖ్యమంత్రిని చేసే అజెండాతో ఈ ఒకటిన్నర సంవత్సరాలు పని చేస్తే, నేను ముఖ్యమంత్రి అవ్వగానే మీ అందరికీ ఒక పధకం పెట్టి ఆదుకుంటాను అని జగన్ చెప్పనున్నారు... ఇప్పటికే కొన్ని పత్రికలు, టీవీ ఛానెల్స్ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థుతుల్లో ఉన్నాయి... అలాంటి పత్రికలు, టీవీ ఛానెల్స్ అన్నిటినీ ఈ ఒకటిన్నర సంవత్సరాలు కావాల్సిన ఆర్ధిక సహాయం కూడా చేస్తాను అని చెప్పనున్నట్టు సమాచారం... తన పాదయాత్ర తప్ప, ఇంకా ఏ వార్తా రాకూడదు అని, ఈ రాష్ట్రానికి నేనే దిక్కు అనే భావన కలిగించాలి అని, ఆ పత్రికలు, టీవీ ఛానెల్స్ ని అడిగి, వారికి కావాల్సిన భరోసా ఇచ్చి, చివరగా వాళ్ళ అందరి ఆశీర్వాదం తీసుకుని జగన్ పంపించనున్నారు...

abn rk jagan 24102017 3

అయితే ఇప్పుడు అందరి ద్రుష్టి ఏబిన్ రాధాకృష్ణ పై పడింది... జగన్ ఏబిన్ రాధాకృష్ణని కూడా పిలిచారా లేదా అనే సందేహాలు ఉన్నాయి... ఇప్పటికే జగన్ అండ్ కో, ఏబిన్, ఆంధ్రజ్యోతిని బహిష్కరించినట్టు పిలుపు ఇచ్చాయి... అయితే మారిన పరిస్థుతుల్లో సొంత మతాన్ని కూడా పణంగా పెట్టి స్వామీజీలను, పగను పక్కన పెట్టి రామోజీని కలసిన జగన్, ఏబిన్ రాధాకృష్ణ దగ్గరకు వెళ్ళటం పెద్ద సమస్య కాదు అంటున్నారు... జగన్ కు ముఖ్యమంత్రి కుర్చీ కావలి అని, దాని కోసం మడం తిప్పేస్తారు అని అంటున్నారు వైసిపి ముఖ్య నాయకులు... మరి ఏబిన్ రాధాకృష్ణ స్వయంగా వస్తారా, లేక ప్రతినిధిని పంపిస్తారా ? లేకపోతే జగన్ స్వయంగా రాధాకృష్ణ దగ్గరకు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది...

రెండు నెలల క్రిత్రం విజయవాడలో ఆడిన జగన్నాటకం గుర్తుందా... వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో, కాపుల ఆగ్రహానికి గురై, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే... అయితే అప్పట్లో, ఈ ఎపిసోడ్ అంతా, జగనే దగ్గరుండి చేపించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి... వంగవీటి రాధా కూడా, ఇలాంటి వెధవలను పార్టీ ప్రోత్సహించ బట్టే పార్టీ ఇలా ఉంది అంటునే, మా అరెస్ట్ తో ప్రభుత్వానికి సంబంధం లేదు అని కూడా అన్నారు.

gowtham reddy radha 24102017 2

ఇవన్నీ పక్కన పెడితే, సస్పెండ్ అయిన తరువాత, ఎవరన్నా మాట్లాడకుండా ఉంటారా ? రాధ అన్ని బూతులు తిడితే, కనీసం గౌతం రెడ్డి, వాటికి సమాధానం ఇవ్వలేదు... గౌతం రెడ్డి ఇంటి ముందు, దసరా, దీపావళి శుభాకాంక్షలు అంటూ, జగన్ ఫోటులు వేసి ఉన్న బానేర్లు, ఫ్లెక్స్ లు వేసుకున్నాడు... ఇవి అన్నీ నడుస్తూ ఉండగానే, తాజాగా ఏకంగా జగన్ బంధువు, కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి గౌతమ్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఆ ఫోటోలు ఇప్పుడు బయటకి వచ్చాయి. అంతే కాదు వైవీ సుబ్బారెడ్డి కూడా ఆ సమయంలో అవినాష్ రెడ్డితో పాటు గౌతం రెడ్డిని కలిసారు అని వార్తలు వచ్చయి..

gowtham reddy radha 24102017 3

వీటన్నిటితో పాటు, తాను సూచించిన మైనార్టీ నాయకుడిని కాకుండా, గౌతమ్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న వ్యక్తికి డివిజన్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలను అప్పగిస్తూ స్వయంగా జగన్‌ నిర్ణయం తీసుకోవడంతో వంగవీటి రాధా అసంతృప్తితో ఉన్నారు, జగన్ తన పట్ల చూపిస్తున్న వివక్ష రాధా జీర్ణించుకోలేకపోతున్నారు. తన తండ్రి పట్ల అత్యంత నీచ్చంగా మాట్లాడిన గౌతమ్‌రెడ్డిని, జగన్ సస్పెండ్ చేసాను అంటూనే, నాటకాలు ఆడుతున్నాడు అని రాధ రగిలిపోతున్నాడు.. అవినాష్‌ రెడ్డి , వైవీ సుబ్బారెడ్డి వెళ్లి గౌతం రెడ్డిని కలిసారు అంటేనే, తనకు, తన తండ్రికి ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది అంటూ, అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు... చివరకు ఇది ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read