ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ సునీల్ కుమార్‌పై, ఎంపీ రఘురామరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసారు. సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తనను పర్సనల్ గా టార్గెట్ చేసారని పిటీషన్ లో తెలిపారు. సిఐడి సునీల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు చేస్తున్నారు అంటూ, గతంలో రఘురామకృష్ణం రాజు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తరువాత కేంద్రం, సునీల్ కుమార్ కు నోటీసులు పంపించింది. ఇది ఇలా ఉంటే, ఈ కేసుని సాకుగా చూపించి, సునీల్ కుమార్ తన పై వ్యక్తిగతంగా టార్గెట్ చేసారు అంటూ, తన పిటీషన్ లో తెలిపారు. అలాగే సునీల్ కుమార్ కు తన భార్యతో వివాదాలు ఉన్నాయని, ఆ వివాదాల్లోకి తనను కూడా లాగి టార్గెట్ చేస్తున్నారని అన్నారు. అయితే రఘురామరాజు పిటీషన్ ని విచారణకు స్వీకరించిన హైకోర్టు, సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. రఘురామరాజు పిటీషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను నాలుగు వారల పాటు హైకోర్ట్ వాయిదా వేసింది.
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు, హైకోర్టు నోటీసులు...
Advertisements