ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెరుగుతుంది. మరో పక్క రెండు రోజుల నుంచి ఉద్యోగ సంఘాల నేతల తీరు మారటంతో, కింద స్థాయిలో అబధ్రతతో ఉన్నారు. ఇక ఈ రోజు కొత్త పీఆర్సి ప్రకారం, రేపు ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆదేశాలు పాటించిని ట్రెజరీ ఉద్యోగులకు చార్జ్ మెమోలు దాఖలు చేసారు. 27 మంది డీడీ, ఎస్టీఓ, ఏటీఓలకు మెమోలు జారీ చేసి, ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీరు జీతాల బిల్లులు ప్రాసెస్ చేయటంలో విఫలం అయ్యారని, ప్రభుత్వం చెప్తుంది. అయితే గతంలో ఉద్యోగ సంఘ నేతలు, తమకు మెమోలు ఇస్తే మెరుపు సమ్మెకు దిగుతాం అని చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం చర్యలకు పాల్పడుతున్న ఉద్యోగ సంఘాలు, కేవలం ఖండనలకే పరిమితం అయ్యారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం రెచ్చగొట్టే తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతల మాటలు విని, ట్రెజరీ ఉద్యోగులు బలి అయ్యారు. మరి ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు పోరాడతారో, ప్రభుత్వంతో సంధికి వెళ్తారో చూడాలి.
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. మెరుపు సమ్మెకు ఉద్యోగులు దిగుతారా ?
Advertisements