ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు, జగన్ మోహన్ రెడ్డి కొత్త పీఆర్సి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా, జీతాలు పెరగాల్సింది పోయి, తగ్గిపోయాయి. అయితే కొంత మంది ఉద్యోగులకు రికవరీ పేరుతో ఎదురు కట్టాల్సిన పరిస్థితి. అయితే ఈ అంశం పైన ఉద్యోగులు ఆందోళన చేస్తూనే, న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి హైకోర్టు ఈ పిటీషన్ పై విచారణ చేస్తుంది. ఈ పిటీషన్ చివరకు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకు వచ్చింది. ఈ రోజు హైకోర్టు ఈ అంశం పైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలో పేర్కొన్న విధంగా, రికవరీ లేకుండా ప్రస్తుతానికి జీతాలు వేయాలని ఆదేశాలు ఇచ్చింది. జీతాల నుంచి రికవరీ చేయటం అనేది, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని హైకోర్టు అభిప్రాయ పడింది. అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది మాత్రం, రికవరీ అంశం ఎక్కడా జీవోలలో లేదని కోర్టుకు తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు, దీని పైన ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. మొత్తానికి, ఈ అంశంలో ఉద్యోగులకు ఊరట లభించింది. అయితే కొత్త పీఆర్సి విషయంలో మాత్రం సహజంగా కోర్టులు జోక్యం ఉండదు. మరి కోర్టు తదుపరి విచారణలో ఏమి చెప్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read