గతంలో మనం చదువుకునే రోజుల్లో, చిత్ర విచిత్రమైన పన్నులు విధించే రాజులను, అవి కట్టక పోతే, హింసించే పాలకులను మనం చూసే వాళ్ళం. తరువాత ప్రజా ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత, పన్నులు వేయటం, వాటిని పెంచటం అనేది మనకు పరి పాటి. కుళాయి పన్ను, ఇంటి పన్ను, ఇలా కొన్ని పన్నులు ఉండేవి. ఇవే పెంచుతూ తగ్గిస్తూ ఉండే వారు. పెట్రోల్, డీజిల్ లాంటి వాటి పైన, పైసా పన్ను పెరిగినా, దేశం మొత్తం స్థంభింప చేసేలా నిరసనలు జరిగేవి. అలంటిది ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విధిస్తున్న పన్నులు, వాటి వసూలు కోసం, ప్రభుత్వం పడుతున్న పాట్లు చూస్తే, ప్రజలను ఎలా హింసిస్తున్నారో అర్ధం అవుతుంది. ఎక్కడా లేని విధంగా చెత్త పన్ను వేసారు. బాత్ రూమ్ పన్ను వేసారు. ఇలా అనేక చిత్ర విచిత్ర పన్నులు వేస్తున్నారు. చెత్త పన్ను ఏంటిరా, చెత్త నా డ్యాష్ అని అయ్యన్నపాత్రుడు అన్నాడని ఆయన పై కేసులు పెట్టారు. అయితే వాస్తవంలో మాత్రం, వైసీపీ ప్రభుత్వం తీరు దీనికి భిన్నంగా ఏమి లేదు. ఇంట్లో చేత్తకు కూడా టాక్స్ కట్టాలి అంటూ బలవంతం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా, ప్రజలను వేధిస్తుంది అని చెప్పటానికి, గత రెండు రోజులుగా, జరిగిన రెండు సంఘటనలే ఇందుకు ఉదాహరణ.

jagan 19032022 2

రెండు రోజుల క్రితం కర్నూల్ లో, చెత్త పన్ను కట్టలేదని, ఒక షాపు ముందు తీసుకుని వచ్చి చెత్త అంతా పోశారు. అంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. చెత్త పన్ను కట్టక పోతే, పరిస్థితి ఇలాగే ఉంటుందని, హెచ్చరికలు పంపుతుంది ప్రభుత్వం. ఇలాంటివి సినిమాల్లో చూస్తాం, ఇప్పుడు రియాలిటీలో చూస్తున్నాం. ఇక మరో సంఘటన, ఇది వింటే షాక్ అవుతారు. కాకినాడలో జప్తు వాహనాలు అని తిరుగుతున్నాయి. మీరు ఇంటి పన్ను కట్టక పోతే, మీ ఇంటికి వచ్చి మీ సామాన్లు జప్తు చేస్తాం, ఇది జప్తు వాహనం అంటూ, ప్రజలను బెదిరిస్తున్నారు. ఇంటి పన్ను, కుళాయి పన్ను వెంటనే చెల్లించాలని, లేకపోతే, మీ ఇంట్లో వస్తువులు ఎత్తుకు పోతాం అని ప్రభుత్వమే బెదిరిస్తుంది అంటే, ఏమని చెప్పుకోవాలి ? అయితే ఈ జప్తు ఇంకా మొదలు కాలేదు, ఇప్పుడు కేవలం బెదిరిస్తున్నారు. రేపు ఇంట్లో వస్తువులు ఎత్తుకుపోయి ఏమి చేస్తారో మరి. మొత్తానికి ప్రభుత్వ తీరు పై, అన్ని వైపుల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం, రోజుకి ఒక కొత్త ఆలోచనతో ముందుకు వస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read