ప్రశాంత్ కిషోర్... మన ఏపి ఈ రోజు ఇంత రివర్స్ లో, ఇంత దౌర్భాగ్యంగా ఉండటానికి కారణమైన వ్యక్తి. 2014 తరువాత విభజన జరిగి, నవ్యాంధ్రని ఒక్కో మెట్టు నిర్మించుకుంటున్న సమయంలో, కులం, మతం , ప్రాంతం కుంపట్లు పెట్టి, దీనికి తోడుగా ఫేక్ ప్రచారం చేసి, ప్రజల మనసులను కలుషితం చేసి, జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాడు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రగతి వేగంగా పాతాళంలోకే పడిపోతూ వచ్చింది. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ వాడిన ఆస్త్రాలు, ఫేక్... ఫేక్... ఫేక్.. కమ్మ డీఎస్పీలు, డేటా గ్రిడ్, పింక్ డైమెండ్, ఇలా ఒకటి కాదు రెండు కాదు, రోజుకి ఒక ఫేక్ తో, ప్రజల ముందుకు వచ్చే వాడు. అయితే ఇప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్, జగన్ మోహన్ రెడ్డితో కలిసి పని చేస్తున్నారు. రెండు మూడు సార్లు, స్వయంగా వచ్చి జగన్ ను కలిసాడు కాదు. ఈ మధ్య వచ్చిన ప్రశాంత్ కిషోర్, జగన్ మోహన్ రెడ్డి పని అయిపోయిందని, వెంటనే మార్పులు చేయకపోతే, మొత్తం మునిగిపోతారని, ప్రజలు మీ పాలన పై విసుగెత్తి ఉన్నారని సర్వే రిపోర్ట్ చేతిలో పెట్టటంతో, జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ప్రజల వద్దకు వెళ్ళాలని వైసీపీ శ్రేణులకు చెప్పిన విషయం తెలిసిందే. దీనికి తోడుగా ప్రశాంత్ కిషోర్ కూడా పని మొదలు పెట్టాడు. అయితే గతంలో వాడిన ఫేక్ ను వైసీపీతో, జగన్ తో చెప్పిస్తే వర్క్ అవుట్ అవ్వదని గ్రహించాడు.
జగన్ మొహన్ రెడ్డి అన్నీ ఫేక్ ఆరోపణలే చేస్తాడని, ప్రజలకు తెలిసిపోవటం, ప్రజల్లో జగన్ మాటలకు, వైసిపీ చేతలకు ఎలాంటి క్రెడిబిలిటీ లేదని తెలియటంతో, ప్రశాంత్ కిషోర్ ఏపి పై వ్యూహం మార్చాడు. తన క్లైంట్ ల చేత, పక్క రాష్ట్రాల నుంచి వైసీపీకి అనుకూలంగా రాజకీయం చేపిస్తున్నాడు. ఇందులో భగంగానే, మమతా బెనర్జీ పెగాసిస్ పై చంద్రబాబు పై ఆరోపణలు చేయటం, అక్కడ నుంచి వైసీపీ అందుకోవటం జరిగింది. అయితే టిడిపి వెంటనే దీన్ని, ఆర్టిఐ రిపోర్ట్ బయట పెట్టి ఎదుర్కోవటంతో, వైసీపీ ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే వ్యూహం ప్రశాంత్ కిషోర్ అవలంభిస్తారని తెలుస్తుంది. తమిళనాడు స్టాలిన్, తెలంగాణా కేసీఆర్, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా, ఇలా సియంల చేత, చంద్రబాబు పై విమర్శలు చేపించి, తద్వారా వైసీపీకి మేలు చేసే రాజకీయ వ్యూహం పన్నారు. జగన్ కు ఏపి ప్రజల్లో క్రెడిబిలిటీ తగ్గిపోవటంతో, ప్రశాంత్ కిషోర్ ఈ వ్యూహం అమలు చేస్తున్నారు. మరి రాను రాను టిడిపి వీటిని ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.