ఇద్దరు నాయకులకు తేడా ఏంటో చెప్పే సంఘటన ఇది. ఈ మధ్య కాలంలో, మీడియా , వివిధ పార్టీల స్టాండ్ తీసుకుని, ఎవరి భజన వాళ్ళు చేస్తున్నారు. వేరే ఛానెల్స్ వాళ్ళు ప్రశ్నలు అడిగితే, మీకు మేము సమాధానం చెప్పం, మీరు ఆ పార్టీ వాళ్ళు అంటూ, తప్పించుకుంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ జగన్ మోహన్ రెడ్డి. ఏబీఎన్, టీవీ5, ఈటీవీ అంటే చాలు, జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ లేని భయం. అసెంబ్లీలో, పార్టీ మీటింగ్ లో, ఎక్కడైనా, ఆ మూడు ఛానెల్స్ భజన చేస్తూ ఉంటారు. చివరకు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వాళ్ళని పార్టీ కార్యక్రమాలకు బ్యాన్ చేసారు కూడా. అయినా కూడా ఇగో చల్లారలేదు. ఏకంగా ప్రభుత్వం వైపు నుంచి ఆ రెండు ఛానెల్స్ కేబుల్ లో కూడా రాకుండా చేసారు. ఒక సందర్భంలో జగన్ మోహన్ రెడ్డిని, ఏబిఎన్ ప్రతినిధి ప్రశ్నలు అడుగుతుంటే, జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మాట్లడుతూ, మేము మీకు సమాధానం చెప్పం, మీరు బ్యాన్ కదా అంటూ తప్పించుకున్నారు. ఒక మీడియా చానెల్ కు ఇంత పెద్ద పార్టీ, ఇంత ప్రభుత్వం ఎలా భయపడుతుందో చెప్పే సంఘటన ఇది. ఇక రెండో వైపు, మరొక పార్టీ, మరొక నేత. నారా లోకేష్ ఈ మధ్య కాలంలో, మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు. అనేక ప్రశ్నలు తీసుకుంటున్నారు.

ln 19032022 2

మరీ ముఖ్యంగా లోకేష్ ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ? నేను మిగతా వారిలా పారిపోను, ఎన్ని ప్రశ్నలు అయినా, ఎలాంటి ప్రశ్నలు అయినా, మీకు ప్రశ్నలు లేవు అనే దాకా చెప్తూనే ఉంటా అని ధైర్యంగా మీడియాను ఎదుర్కుంటున్నారు. సాక్షి ని పిలిచి మరీ అడుగుతున్నారు. సాక్షి మైక్ పైకి లేపి, మన సాక్షి వచ్చిందా ? ఏ అన్నా, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా, ఉంటే చెప్పు అంటూ, ప్రశ్నలు అడుగుతున్నారు. సాక్షి సాక్షి అంటూ, లోకేష్ సాక్షిని ఆట పట్టిస్తున్నారు. లోకేష్ అంత డేరింగ్ గా ఉండటంతో, సాక్షికి సౌండ్ లేకుండా పోయింది. ఇక నిన్న మరో సంఘటన జరిగింది. సాక్షి ఎక్కడా, ఈ రోజు సాక్షి రాలేదు, ఇక్కడా మరో సాక్షి ఉంది, టీవీ9 అంటూ, లోకేష్ పంచ్ పేల్చారు. సాక్షిని ఎక్ష్పొజ్ చేసినట్టే, బ్లూ మీడియాని ఇలాగే ఎక్ష్పొజ్ చేయాలి అంటూ, తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. మరో సాక్షి అంటూ , టీవీ9 పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. టీవీ9 ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 2 చానెల్ గా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read