తెలుగు న్యూస్ చానెల్స్ ఒకదానికి ఒకటి పోటీ పడి వ్యవహరిస్తూ ఉంటాయి. ఇప్పటికే న్యూస్ చానెల్స్ అన్నీ, ఒక పార్టీ స్టాండ్ తీసుకుని పని చేస్తున్నాయి అనే విషయం అర్ధం అవుతుంది. నీలి మీడియా చానెల్స్ గా కొన్ని, పచ్చ చానెల్స్ అని కొన్ని ఇలా విమర్శలు చేసుకుంటూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి అయితే టీవీ5, ఈనాడు, ఏబిఎన్ పేరు చెప్తే, నిదరలో కూడా ఉలిక్కి పడుతూ ఉంటారు. ఇక సాక్షితో పాటు, మరి కొన్ని చానెల్స్ జగన్ భజన చేయటంలో ఆరి తేరి ఉన్నాయి. వీళ్ళకు ప్రజా సమస్యలు అసలు పట్టవు. కేవలం జగన్ మోహన్ రెడ్డి భజనే. ఈ నేపధ్యంలో తాజాగా బార్క్ టీవీ ఛానెల్ రేటింగ్స్ ప్రకటించింది. చాలా కాలం తరువాత, బార్క్ ఈ రేటింగ్స్ ప్రకటించింది. చాలా కాలం పాటు తెలుగు న్యూస్ చానెల్ లో టాప్ అంటే టీవీ9 ఛానెల్ అనేది అందరికీ తెలిసిందే. టీవీ9 ఛానెల్ రవి ప్రకాష్ ఉండగా, ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది. అయితే రాను రాను, టీవీ9 ఛానల్ కు గడ్డు పరిస్థితి రావటం, వారు తీసుకున్న రాజకీయ స్టాండ్, తీసుకున్న ప్రోగ్రాంలు కూడా ప్రజల్లో ఆదరణ కోల్పాయాయి అనే చెప్పే విధంగా, తాజా ర్యాంకింగ్స్ ఉన్నాయి. చాలా కాలం పాటు, నెంబర్ వన్ తెలుగు న్యూస్ చానెల్ గా, పేరు తెచ్చుకున్న టీవీ9, తన మొదటి ప్లేస్ ను కోల్పోయి, రెండో స్థానానికి పడిపోయింది.

news 18032022 2

ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం, నెంబర్ వన్ న్యూస్ చానెల్ ఎన్ టీవీ. 77 పాయింట్లతో ఎన్టీవీ మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానంలో టీవీ9 ఉన్నా, పాయింట్స్ పరంగా చూస్తే ఎక్కడో ఉంది. రెండో స్థానంలో ఉన్న టీవీ9 కు కేవలం 55 పాయింట్లు వచ్చాయి. మొదటి ప్లేస్ కు, రెండో ప్లేస్ కు మధ్య 20 పాయింట్ల తేడా ఉంది. ప్రజలకు ఇష్టమైన కంటెంట్ ఇవ్వకపోతే, కొన్నేళ్లుగా నెంబర్ వన్ ఉన్న చానెల్ అయినా, పడిపోక తప్పదు. ఇక మూడో స్థానంలో తెలంగాణా రాష్ట్రానికి చెందిన వీ6 ఛానెల్ నిలిచింది. మిగతా చానెల్స్ అయిన టీవీ5, ఏబీఎన్, సాక్షి, ఈటీవీ లాంటి న్యూస్ చానెల్స్ 15 నుంచి 30 పాయింట్ల మధ్య, ఎప్పటి లాగే తమ స్థానాన్ని నిలుపుకున్నాయి. అర్బన్ ప్రాంతాలతో పాటుగా, రూరల్ ప్రాంతంలో కూడా ఎన్టీవీ టాప్ లో నిలవటం మరో గమనించాల్సిన అంశం. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో ఎన్టీవీ నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అయ్యింది. దారుణంగా పడిపోయిన టీవీ9, ఇప్పటికైనా తన తప్పులు తెలుసుకుంటుందో లేదో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read