ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఈ నెల 11 వ తేదీన ఉంటుందని చెప్పి, వైసీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనితో వైయస్ఆర్ పార్టీ వర్గాలతో పాటు, అధికార వర్గాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయి. ప్రధానంగా ఈ నెల 7 వ తేదీన మధ్యాహ్నం ౩ గంటలకు కాబినెట్ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కాబినెట్ సమావేశం అనంతరం గాని లేదా మరుసటి రోజు ఉదయం కాని జగన్ రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కలుస్తారని అని సమాచారం. దీని గురించి పార్టీ నేతలు 8వ తారిఖు న గవర్నర్ ప్రోగ్రాం ఏంటని, ఆయన అపాయింట్మెంట్ గురించి రాజభవన్ అధికారులను ఆరా తీసినట్టు సమాచారం. అయితే సహజంగా కాబినెట్ సమావేశం ఉదయం ఉంటుంది. కాని ఈసారి కాబినెట్ సమావేశం మధ్యాహ్నం ౩ గంటలకు ప్రారంబమవుతుందని చెప్పారు. ఈ సమావేశం రెండు గంటల పాటు ఉండచ్చని అంచనా . అయితే ఈ సమావేశంలో మంత్రులకు రాజీనామా విషయాల గురించి జగన్ చర్చిస్తారని తెలుస్తుంది. ఒకరు,ఇద్దరు మంత్రులు తప్పితే అందరి దగ్గరా జగన్ రాజీనామాలు తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే, జగన్ మోహన్ రెడ్డి మంత్రులతో వన్ టు వన్ చర్చిస్తారని తెలుస్తుంది.
అదే రోజు రాత్రికి మంత్రులు అందరికీ డిన్నర్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరుసటి రోజు గవర్నర్ ను కలిసి కాబినెట్ పునర్ వ్యవస్థీకరణ కు సంభందించి 11 తేదీన సమయం తీసుకుంటారని సమాచారం. ఆ తరువాత 10 వ తేదీన కొత్తగా వచ్చే మంత్రులకు సమాచారం ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీని గురించి మంత్రులు గాని, పార్టీ నేతలు ఎవ్వరుకూడా ధృవీకరించడం లేదు. పార్టీలో ఒకరిద్దరు మంత్రులు తప్ప అందరు తప్పుకోవాల్సిందేనని జగన్ ఆదేశించినట్లు సమాచారం. అయితే పార్టీ లో ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వారికి జగన్ కీలక భాద్యతలు అప్పగిస్తారని ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మళ్ళీ ఎన్నికల్లో గెలిచి వస్తే, మళ్ళీ మంత్రి పదవులు మీకే అని జగన్ చెప్తున్నారు. అయితే ఆసహావులు కూడా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కులాల కోటాలో, మంత్రి పదవి సంపాదించటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త మంత్రులు ఎవరూ అనే విషయం పై, రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొంది.