ఏపి లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసిపి మరోసారి అధికారం దక్కించుకునేందుకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తుంటే, ప్రతిపక్షాలు కూడా ఏ మాత్రం వెన్నక్కి తగ్గకుండా ఎన్నికల బరిలో దిగటానికి సిద్దమవుతున్నాయి. వైసిపి పాలనలోప్రజలు విసిగి పోయారని, ఎప్పుడెప్పుడు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రతిపక్షాలుతరుచూ వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలకు బిజెపి- జనసేన-టిడిపి కలిసి పోటీ చేస్తారని వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ సోము వీర్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేసారు. అవసరం అనుకుంటే, తాము ఏపి లో బిజెపి ఒంటరిగానే పోటి చేసి గెలుస్తామని, తాము ఎవ్వరితో పొత్తు పెట్టుకోకపోయినా ఎన్నికలకు వెళ్ళగలం అని స్పష్టం చేసారు. రాష్ట్రంలో పొత్తుల విషయం ఎక్కడా ప్రస్తావించ వద్దని డిల్లి పెద్దలు ఎన్ని సార్లు చెప్పినా, సోము వీర్రాజు మాత్రం ఎన్నికల పొత్తుల విషయం పై అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఈలాంటి వ్యాఖ్యలు చేయడం వలన భవిష్యత్తు లో లేని పోని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతానికి బిజెపి - జనసేన మధ్య స్నేహ పూర్వక బంధం ఉన్నపటికీ , సోము వీర్రాజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
సోమ దూకుడు చర్యల వల్ల, జనసేన - బీజేపీ కలిసి పనిచేయాలని ఉన్నా , ఈయన వ్యవహార శైలి రోజురోజుకి ఈపార్టీ ల మధ్య దూరం మరింత పెంచుతుంది. ఇక జనసేన పార్టీ పై వీర్రాజు చేసున్న వ్యాఖ్యలు వాళ్ళని కలుపుకోకపోగా ఆ పార్టీని అవమానించే లాగా ఉన్నాయని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతల తీరు మాత్రం అనుమానాలకు తావు ఇస్తుంది. సోమువీర్రాజు లాంటి వాళ్లకు ..వాళ్ళ పార్టీ కి ఒక్క శాతం ఓటు వచ్చిన సరే ఒంటరిగానే పోటి చేయాలనడం , ఇది ఇంకెవరికో లాభం చేయాలనే ఉద్దేశం తోనే చేస్తునారని, ఏపి బిజెపిలోని మరో వర్గం మాత్రం తీవ్రం గా విమర్సిస్తుంది. ఎవరేమునుకున్నా సరే సోము వీర్రాజు మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నా సరే ఏ మత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒక పక్క పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పార్టీల ఓటు చీలకుండా, జగన్ ను ఓడించాలని అంటుంటే, సోము వీర్రాజు మాత్రం, జగన్ కు మేలు చేసే విధంగా, ప్రతిపక్ష పార్టీలు అన్నీ విడివిడిగా పోటీ చేయాలని, ఓటు చీలి పోవాలి అనే విధంగా మాట్లాడటం, అందరినీ షాక్ కు గురి చేస్తుంది.