ఉపాధి హామీ పధకంబిల్లుల చెల్లింపులకు సంబంధించి ఈ రోజు హైకోర్ట్ లో కోర్ట్ దిక్కరణకు సంబంధించి విచారణ జరిగింది. ఈ విచారణకు సంభందించి రాష్ట్ర ఆర్ధిక శాఖ ,పంచాయితీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ , గోపాల కృష్ణ ద్వివేది తో పాటు పంచాయితీ రాజ్ కార్యదర్శి కోన శశిధర్ హైకోర్ట్ కు హాజరు అయ్యారు. అయితే పిటీషనర్ల తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.
కోర్ట్ దిక్కరణకు సంభందించి ఈ కేసుల్లో నేటి వరకు కూడా బిల్లులు ఇవలేదని ,గతంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పుకు సంభందించి బిల్లులు ఇవ్వకపోవడంతో ,మళ్ళి అదే పిటీషనర్లు ,అదే పిటీషన్లు దాఖలు చేసారని ఆయన హైకోర్ట్ దృష్టికి తీసుకోచ్చారు. ఈ సందర్భంగా హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ జ్యోక్యం చేసుకొని ,ఇటీవల కర్నూల్ లో ఇలాగే ఒక కాంట్రాక్టర్ పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వక పోవడంతో ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడని ,తానూ పేపర్లో చదివానని , ఇప్పుడు వారి కుటుంబానికి ఎవరు ఆసరాగా నిలబడతారని ,హైకోర్ట్ న్యాయమూర్తి అధికారులను నిలదీసారు. వెంటనే 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చ్ వరకు CFMS ద్వారా బిల్లులు చెల్లింపులకు సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ను కోర్ట్ కు సమర్పించాలని హైకోర్ట్ ఆదేశించింది .రెండు వారాల్లోపు ఈ స్టేట్ మెంట్ ను కోర్ట్ కు అందచేయాలని హైకోర్ట్ ఆదేశించింది .

Advertisements

Advertisements

Latest Articles

Most Read