గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ నేతలు చేస్తున్న కార్యక్రమంలో, రోజు రోజుకీ ప్రజల నుంచి నిలదీతలు ఎక్కువ అయ్యాయి. తమ సమస్యల పై ప్రజలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అరకు ఎమ్మెల్యే కాలర్ కూడా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం బయటకు రావటం లేదు. ఎమ్మెల్యేలను మాత్రమే తిరగమని చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యేలకు మాత్రం, ప్రజలు దబిడి దిబిడి చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి వెల్లంపల్లి గడప గడపకూ వెళ్తుంటే, ఒక ఇంజనీర్ చుక్కలు చూపించాడు. మీరు రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అంటూ వెల్లంపల్లిని నిలదీసారు. ఆ జనీర్ మాటలకు వెల్లంపల్లి ఆయన అనుచరులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తన దగ్గర మీ అవినీతి పై సాక్ష్యాలు కూడా ఉన్నాయని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. అయితే అక్కడే మీడియా ఉండటంతో, వెల్లంపల్లి రెచ్చిపోయారు. అక్కడున్న పోలీసులని పిలిచి, సాక్ష్యాలు తను ఇవ్వకపోతే వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. మరి జగన్ మోహన్ రెడ్డి 6 లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు చేసినప్పుడు, వెల్లంపల్లి ఎక్కడున్నారో మరి ?
నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిన వైసీపీ.. ప్రజలు ప్రశ్నిస్తే, నిలదీస్తే, ఇక అరెస్ట్ లే నా ?
Advertisements