ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త బాదుడే బాదుడుకు జగన్ ప్రభుత్వం సిద్దమయింది. మధ్య తరగతి గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది. ఇళ్ళల్లో 500 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ వాడుకునేవారు కొత్తగా ఏసీడీ ఛార్జీలు కట్టాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు అయితే కమర్షియల్ వినియోగదారులు మాత్రమే ఏసీడీ ఛార్జీలు ప్రభుత్వానికి చెల్లించేవారు. కాని ఇక నుంచి హౌస్ హోల్డ్ కనెక్షన్స్ నుంచి కూడా ఏసీడీ ఛార్జీల వసూలు చేయాలనీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు వచ్చే కొత్త బిల్లులు ఏసీడీ ఛార్జీలతో కలిపి జారీ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే అపార్ట్‌మెంట్లలో కామన్ మీటర్ ఉండేవారికి అయితే భారీగా బిల్లులు వచ్చి పడుతున్నాయి. ఎవరికీ అయితే 500 యూనిట్లపై బడి విద్యుత్ వినియోగిస్తారో వారందరూ ఈ ఏసీడీ ఛార్జీలు కట్టలిందే అని ప్రభుత్వం కొత్త తరహాలో బాదుడు మొదలు పెట్టింది. ఇప్పటికే రోజురోజుకి పెరుగుతున్న ఖర్చులతో పేద ,మధ్య తరగతి వారు సతమతమవుతుంటే ,ప్రభుత్వం ఇలా రోజుకొక బాదుడు తో ప్రజల నెత్తిన గుదిబండ పెడుతుంది.
మధ్య తరగతి పై మరో బాదుడే బాదుడు.. బాదుడులో తగ్గేదేలే అంటున్న జగన్..
Advertisements