అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. ఉండవల్లిలో రైతులు కట్టిన ఫ్లెక్సి ప్రభుత్వానికే సవాలుగా మారింది. అయితే రాజధాని మాస్టర్ ప్లాన్లో లేని ఒక రోడ్డుని విస్తరణ చేయాలని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే జగన్ అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేసారు. అయితే ఈ రోడ్డు విస్తరణ పనులలో భాగంగా తమ పొలాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అయితే తమకు చెల్లించాల్సిన నష్ట పరిహారం ఇవ్వకుండా ఆ రోడ్డు పనులు ఎలా చేస్తారని రైతులు వాపోతున్నారు. తాము రాజధాని అభివృద్దికి ఏ మాత్రం అడ్డం కాదని, కాని తమ పొలాలను తీసుకుని, ప్రభుత్వం ఏ నష్ట పరిహారం చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందు తమకు నష్ట పరిహారం చెల్లించి, ఆ తరువాతే వారు రోడ్డు విస్తరణ పనులు చేసుకోవాలని రైతులు అడ్డుపడుతున్నారు. దీని పై అధికారులు స్పందిస్తూ కరకట్ట రోడ్డు వేయడం ద్వారా రాజధానికి మార్గం సులభమవుతుందని , దీనికి రైతులు సహకరించాలని అధికారులు రైతులకు సద్దిచేప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం తమ పొలాలలో తమ అనుమతి లేనిదే ఎవ్వరూ రోడ్డు విస్తరణ పనులు చేయకూడదని, ఫ్లెక్సిలు ఏర్పాటు చేసి విన్నూత్న నిరసన తెలిపారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం దీని పై ఎలా స్పందిస్తుందో చూడాలి

Advertisements

Advertisements

Latest Articles

Most Read