వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై, అనేక సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసుల్లో గతంలో జగన్ మోహన్ రెడ్డి 16 నెలల జైలు శిక్ష కూడా అనుభవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కండీషనల్ బెయిల్ పైన బయట ఉన్నారు. అయితే ఈ కండీషనల్ బెయిల్ పిటీషన్ లో భాగంగా జగన్ మోహన్ రెడ్డి, విదేశీ పర్యటనలకు వెళ్ళ కూడదు అనే షరతు ఒకటి ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్ళాలన్నా, కోర్టు పర్మిషన్ తీసుకుని, విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, తాను విదేశీ పర్యటనకు వెళ్ళాలని, సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. తానూ పారిస్ వెళ్ళాలని, పారిస్ వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వాలి అంటూ సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ విషయం బయటకు రావటంతో, ఇప్పుడు వార్తల్లో టాపిక్ అయ్యింది. వచ్చే నెలలో జగన్ మోహన్ రెడ్డి కుమార్తె గ్రాడ్యూయేషన్ సెర్మనీ పారిస్ లో ఉండటంతో, జగన్ మోహన్ రెడ్డి అక్కడకు వెళ్ళటానికి సిబిఐ కోర్టు పర్మిషన్ అడిగారు. జగన్ మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె, పారిస్ లోని ఒక బిజినెస్ స్కూల్ లో గ్రాడ్యూయేషన్ చదువుతున్నారు. ఆమె, అక్కడ కోర్స్ పూర్తి చేసుకోవటంతో, ఆ గ్రాడ్యూయేషన్ సెర్మనీకి జగన్ వెళ్తున్నారు.
కుటుంబ సమేతంగా జగన్ మోహన్ రెడ్డి అక్కడకు వెళ్తున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన. జగన్ రెండో కుమార్తె లండన్ లో చదువుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అయన వెళ్ళిన కాస్ట్లీ ఫ్లైట్ అలాగే, ఆయన దావోస్ కాకుండా, నేరుగా లండన్ వెళ్ళటం, ఇవన్నీ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసాయి. అలాగే మూడు రోజులు దావోస్ లో మీటింగ్ ఉంటే, ఆయన పది రోజులు పాటు అక్కడ ఉండటం, కూడా వివాదాలకు తావు ఇచ్చింది. ఇప్పుడు ఆయన పూర్తిగా వ్యక్తిగత పర్యటనతో వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మరో అంశం తెర మీదకు వస్తుంది. నెల రోజులు క్రితం, షర్మిల కొడుకు, గ్రాడ్యూయేషన్ సెర్మనీ అమెరికాలో జరిగితే, విజయమ్మ అక్కడకు వెళ్లారు. ఇప్పుడు జగన్ తో విజయమ్మకు సరైన సంబంధాలు లేవు అనే ప్రచారం మధ్య, విజయమ్మ ఇప్పుడు జగన్ కూతురు గ్రాడ్యూయేషన్ సెర్మనీకి, పారిస్ వెళ్తారా లేదా అనే చర్చ జరుగుతుంది.