ఆంధ్రప్రదేశ్ ,అమరావతి రైతులకు చెల్లించాల్సిన కౌలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాయ చేస్తుంది. ఈ రోజు హైకోర్టులో ఈ కౌలు పిటీషన్లపై విచారణ ఉండటంతో సీఆర్డీఏ వారు హడావుడిగా కొందరికి మాత్రమె కౌలు చెల్లించి మమ అనిపించారు. కేవలం 20 శాతం మందికి మాత్రమే, వారి అకౌంట్లలో డబ్బులు జమ అవ్వటంతో , మిగిలిన రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా, ఓకే గ్రామం, ఒకే సర్వే నంబర్‌లోని కొందరు రైతులకే కౌలు చెల్లించారని , రాజధాని రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. అమరావతిలోని మెజార్టీ రైతులకు వార్షిక కౌలు పడలేదని , వారు స్పష్టం చేసారు. దీని పై వారు స్పందిస్తూ మళ్ళి దీని పై కోర్టు లో పిటీషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లు కౌలు పడని రాజధాని రైతులు తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందని , గతేడాది కూడా డబ్బులు లేవని 2 నెలలు జాప్యం చేశారని రైతులు ఆరోపించారు. ఇలా అయితే పొలం కౌలు మీద ఆదారపడే తాము ఎలా బ్రతకాలని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఈ రోజు హైకోర్టులో కీలక కేసు పై విచారణ.... డ్రామాలు ఆడుతున్న ప్రభుత్వం...
Advertisements