నారాయణ విద్యాసంస్థల అధిపతి, మాజీ మంత్రి నారాయణను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. కొండాపూర్‍లో నారాయణ ఇంటికి వెళ్లిన పోలీసులు, ఆయన్ను అడుపులోకున్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అదుపులోకి తేసూన్నత్తు చెప్తున్నారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేస్తారో, ఎందుకు అరెస్ట్ చేసారో ఎవరికీ ఇప్పటి వరకు చెప్పలేదు. నోటీసులు ఇవ్వకుండా, డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేయటం పై, విమర్శలు వస్తున్నాయి. అయితే అమరావతి కేసులు కోర్టు కొట్టేయటంతో, పదవి తరగతి పేపర్ లీక్ విషయంలో, నారాయణను ఇరికించి, అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే గతంలో టిడిపి నేతల పై పెట్టిన కేసులు లాగే, ఇది కూడా ఏమి ఉండదు. కాకపోతే అల్లరి చేయటానికి ఉపయోగ పడుతుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ నెలకొంది. హైదరాబాద్ నుంచి నారాయణను విజయవాడ తరలిస్తున్నారు. అనూహ్యంగా ఆయన భార్య కూడా, ఆయనతో పాటు ఉండటంతో, ఆయన భార్యని కూడా అరెస్ట్ చేసారా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ లో ట్విస్ట్... ఆయన భార్య కూడా అదుపులోకి ?
Advertisements