విజయసాయి రెడ్డి, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత. ప్రజా బలం లేకపోయినా, లాబయింగ్ బలంతో, జగన్ కేసుల్లో సహా నిందితుడు అనే క్వాలిఫెకేషన్ తో, వైఎస్ఆర్ పార్టీలో నిన్నటి వరకు ఒక వెలుగు వేలితారు. నెంబర్ టుగా ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారింలోకి వచ్చిన తరువాత, ఆయన ప్రభావం తగ్గుతూ వచ్చింది. సజ్జలకు అధిక ప్రాధాన్యత రావటంతో, చివరకు విజయసాయి రెడ్డిని, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా గెంటేసారు. ఇలా వైసీపీలో పతనం అంచున ఉన్న విజయసాయి రెడ్డి, ఇప్పుడు బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. పార్టీ మార్పు అయినా కావచ్చు, తన కేసులు అయినా కావచ్చు కానీ, ఏదో ఒక దాంట్లో, ప్రతిఫలం కోసం, ఈ మధ్య విజయసాయి రెడ్డి తపించిపోతూ, తన పార్టీ వైసీపీ అనేది మర్చిపోయి, బీజేపీ భజనలో ఆరి తేరి పోయారు. జాతీయ స్థాయిలో నిన్న ఫోకస్ అయిన అంశం, రాహుల్ గాంధీ అంశం. రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనలో, ఒక పార్టీలో నైట్ క్లబ్ లో ఉన్న అంశం నిన్న బీజేపీ ప్రమోట్ చేస్తూ, రచ్చ రచ్చ చేసింది. రాహుల్ గాంధీకి దేశ పట్ల బాధ్యత లేదని, పార్టీ పట్ల బాధ్యత లేదని, ఇలా రకరకాలుగా బీజేపీ, రాజకీయంగా లబ్ది పొందటం కోసం, హడావిడి చేసింది.

vs 04052022 2

కాంగ్రెస్, బీజేపీ కొట్టుకుంటుంటే, వారి మధ్యలోకి విజయసాయి రెడ్డి దూరారు. మా మోడీ యూరోప్ పర్యటనకు వెళ్తే హేళన చేసారు కదా, ఇప్పుడు మీ రాహుల్ గాంధీ చేసింది ఏంటి అంటూ ప్రశ్నించారు. అంతే కాదు, అంతటితో ఆగలేదు, చైనా వాళ్ళ హనీ ట్రాప్ లో రాహుల్ గాంధీ పడ్డారు అంటూ వ్యాఖ్యలు చేసారు. హనీ ట్రాప్ అంటే, అమ్మాయల వలలో పడటం. అలాగే చైనా రాయబారి హౌ యాంక్వితో రాహుల్ గాంధీ సన్నిహితంగా ఉన్నారు అంటూ, రాహుల్ గాంధీ వైఖరి పై తప్పు పడుతూ ట్వీట్ పెట్టి, మోడీ దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేసారు. దీని పైన కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన విజయసాయి రెడ్డి, వాస్తవం గ్రహించాలని, మీ మీద ఉన్న కేసులకు భయపడి, మీ సాహెబ్ మోడీని సంతోష పెట్టటానికి ట్వీట్లు చేస్తున్నారు కానీ, అక్కడ వాస్తవం రాహుల్ గాంధీ ఒక పెళ్ళికి వెళ్ళారని, దానిలో తప్పు ఏమి ఉంది అంటూ, కాంగ్రెస్ పార్టీ, విజయసాయి రెడ్డికి ఘాటుగా బదులు ఇచ్చింది. కెలికి మరీ తన్నించుకోవటంలో, విజయసాయి రెడ్డి ముందు ఉంటారని, మరోసారి రుజువైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read