రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 151 సీట్లు ఉన్నాయి, తమకు తిరిగు లేదు అంటూ ఎగురుతున్న వైసీపీ పార్టీ, ప్రజల పై అనేక భారాలు మోపింది. ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, వ్యవసాయం దెబ్బతింది, మహిళలకు భద్రత లేదు, చివరకు రోడ్లు వేయటం కూడా రావటం లేదు. అప్పులు చేస్తే కానీ రోజు గడవని పరిస్థితి. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ, బాదుడే బాదుడు అనే కర్యకరమం పెట్టింది. ఈ కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది. చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమలో చేసిన పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఇక తరువాత వచ్చిన మహానాడు అన్నిటి కంటే హైలైట్. తెలుగుదేశం పార్టీ కూడా, అంత మంది వస్తారాని ఊహించలేదు. ఈ స్థాయిలో జగన్ పై వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి. మహానాడు మంచి కిక్ ఇవ్వటంతో, తెలుగుదేశం శ్రేణులు మంచి ఊపులో ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు మరో కిక్ ఇస్తుంది టైమ్స్ అఫ్ ఇండియా సర్వే. జగన్ పరిపాలన పై టైమ్స్ అఫ్ ఇండియా సర్వే చేయగా, అన్ని రంగాల్లో, జగన్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసారు. పరిపాలన, అవినీతి, మూడు రాజధానులు, స్థానిక ఎమ్మల్యేల పని తీరు, అభివృద్ధి, అప్పులు, ఎవరికి ఓటు వేస్తారు, ఇలా ప్రతి దాంట్లో జగన్ కు వ్యతిరేకంగా, టిడిపికి అనుకులంగా సర్వే ఫలితాలు వచ్చాయి. టైమ్స్ అఫ్ ఇండియా లాంటి దాంట్లోనే, జగన్ కు వ్యతిరేకత చూపించారు అంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read