ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. మరో రెండేళ్ళు ఎన్నికలకు ఉన్నా, ఇప్పటి నుంచే హీట్ పెరిగింది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో ఫెయిల్ అవ్వటం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటం, అలాగే అప్పులకు కూడా జగన్ ఇబ్బంది పడుతూ ఉండటంతో, జగన్ పూర్తిగా చేతులు ఎత్తేసారు. కేవలం మీడియాతో, సోషల్ మీడియాతో షో చేస్తూ వస్తున్నారు. ప్రజలు కూడా జగన్ ఎప్పుడు దిగిపోతారా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, ముందస్తు ఎన్నికల వార్తలు జోరు అందుకున్నాయి. ముందస్తు ఎన్నికలు మరో ఏడాదిలో వచ్చేస్తాయని, ఈ విధంగా చేస్తే ప్రజా వ్యతిరేకత కొంత తప్పించుకోవచ్చని జగన్ ప్లాన్. ఇదే విషయం పై గత వారం ఢిల్లీ పర్యటనలో, అమిత్ షా ని కలిసిన సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డి అడిగారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తాము ముందస్తు ఎన్నికలకు వెళ్తామని, జగన్ అమిత్ షాని కోరినట్టు తెలుస్తుంది. ముందస్తు ఎన్నికలకు సహకారం అందించాలని అమిత్ షా ని కోరారట. ఇదే విషయం అమిత్ షా మరో కేంద్ర మంత్రి దగ్గర ప్రస్తావించగా, ఆ కేంద్ర మంత్రి ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలను అడగటం, ఆ ఎంపీలు బయటకు చెప్పటంతో, జగన్ ముందస్తు ప్లాన్ నిజమే అని, ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది

Advertisements

Advertisements

Latest Articles

Most Read