ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కు ఎదురైంది. ఆమె వేసిన రివ్యూ పిటీషన్ ను రాష్ట్ర హైకోర్టు కొద్ది సేపటి క్రితం కొట్టివేసింది. గతంలో హైకోర్టు తీర్పుని అమలు చేయనందుకు, సేవా శిక్షను విధిస్తూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉండే, పలు స్కూల్ ప్రాంగణాల్లో, రైతు భరోసా కేంద్రాలు , గ్రామ సచివాలయ నిర్మాణాలు చేపట్టవద్దు అంటూ, రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా నిర్మాణాలు చేపట్టటం పై, పలు విద్యా కమిటీలు, తల్లిదండ్రులు హైకోర్టులో సవాల్ చేసారు. ఈ పిటీషన్ విచారణ చేసిన అనంతరం, రాష్ట్ర హైకోర్టు, రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయాలు కానీ, స్కూల్ పరిశరాల్లో నిర్మించ వద్దు అని చెప్పి, తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చినా కూడా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోవటంతో, దీని పైన, హైకోర్టు సుమోటోగా హైకోర్టు కోర్టు ధిక్కార కేసు నమోదు చేసింది. దీని పైన కూడా కోర్టు ధిక్కార పిటీషన్ పైన విచారణ చేసారు. ఈ కేసులో, సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఉద్దేశపూర్వకంగానే తీర్పు అమలు చేయలేదని, కోర్టు నిర్ణయానికి వచ్చింది.

sri 13042022 2

మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్లకు రాష్ట్ర హైకోర్టు, జైలు శిక్ష విధించింది. అయితే వీరు అందరూ హైకోర్టుకు క్షమాపణ చెప్పి, తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరారు. అయితే హైకోర్టు వీరి విజ్ఞప్తిని అంగీకరించి, సేవా శిక్షను విధించింది. ఏడాదకి 12 నెలలు పాటు, ప్రతి నెల విద్యార్ధులతో కలిపి, వారితో భోజనం చేసి, సొంత డబ్బుతో వారికి భోజనం పెట్టాలని సేవా శిక్ష విధించింది. అయితే తనకు వేసిన సేవా శిక్షను సమీక్షించాలని ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మీ, రివ్యూ పిటిషన్‍ ను హైకోర్టులో వేసారు. ఈ రివ్యూ పిటీషన్ ను రిజిస్ట్రీ నంబెర్ కేటాయించకుండా తిరస్కరించారు. అయితే ఇది తెలిసిన హైకోర్టు, నంబెర్ ఇచ్చి విచారణలో పెట్టాలని ఆదేశించింది. ఈ రోజు ఈ పిటీషన్ విచారణకు రాగా, శ్రీలక్ష్మి వేసిన రివ్యూ పిటీషన్ ను హైకోర్టు కొట్టేస్తూ, సేవా శిక్షను అమలు చేసి తీరాల్సిందే అంటూ, హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read