దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టుల పట్ల, న్యాయమూర్తుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న ఓ కేసు విషయంలో, కొన్ని ప్రభుత్వాల పై, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మన దేశంలో కోర్టులు తీర్పులు ఇస్తున్నప్పుడు, అవి తమకు అనుకూలంగా లేకపోతే, తీర్పు వ్యతిరేకంగా వస్తే కొన్ని ప్రభుత్వాలు తట్టుకోలేక పోతున్నాయని, న్యాయమూర్తులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూ, వారిని టార్గెట్ చేస్తున్నారు అంటూ, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఈ వ్యాఖ్యలు చేసారు. మన దేశంలో ఈ కొత్త పోకడ మొదలైందని, ఇది దారుణమైన పరిణామం అంటూ, ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఏదైనా కేసు విషయంలో వ్యతిరేక తీర్పు వస్తే, ప్రైవేట్ పార్టీలు కోర్టులను నిందించటం చూసే వారమని, ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రభుత్వాలే ఈ విషయంలో కలుగుచేసుకుని, కోర్ట్ లను నిందిస్తున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఛత్తీస్గఢ్ కు సంబంధించిన ఒక కేసు విషయంలో, సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆడాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అంటూ, మాజీ ఐఏఎస్ అధికారి పై కేసు పెట్టింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. అయితే ఈ కేసుని ఛత్తీస్గఢ్ హైకోర్టు కొట్టిసింది.
అయితే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు నిన్న, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లిల బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. అయితే అప్పటికే ఈ కేసు పైన ఏకంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కోర్టుల పైన వ్యాఖ్యలు చేసాయి. కేసు విచారణకు వచ్చిన వెంటనే , ఇదే అంశం లేవనెత్తారు, జస్టిస్ ఎన్వీ రమణ. ప్రభుత్వమే కోర్టులను దూషిస్తుంది అని, ఈ కొత్త పోకడ గురించి కోర్టు కంటే, న్యాయవాదులకే ఎక్కువ తెలుసు అని, దేశంలో ఈ పరిణామం రావటం చాలా దురదృష్టకరం అని అన్నారు. అయితే దీనికి మూలం మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే పడిందని చెప్పాలి. ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే, జడ్జిలను టార్గెట్ చేయటం, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి జడ్జిలను టార్గెట్ చేస్తూ లేఖలు రాయటం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఇదే అంశం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మొదలు పెట్టింది. దీని పైన సుప్రీం సీరియస్ అయ్యింది.