గుంటూరు జిల్లాలో పర్యటించిన టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి అడుగడుగునా అఖండ స్వాగతం లభించింది. పెదకాకాని నుంచి ఆరంభమైన టీడీపీ కార్యకర్తల బైక్ ర్యాలీ బుడంపాడు, నారా కోడూరు, చేబ్రోలు మీదుగా పొన్నూరు వరకు సాగింది. రహదారులన్నీ పసుపుమయమయ్యాయి. జనసంద్రంని తలపించిన అభిమానుల్ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. తన సభలకు జనం స్వచ్ఛందంగా వస్తున్నారని, బలవంతంగా తరలిస్తూ..నిర్బంచినా జగన్ సభల నుంచి జనం పారిపోతున్నారని పేర్కొన్నారు. సభలకి రాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూన్న జగన్ పవర్ తొందరలోనే కట్ చేస్తామన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేయించారన్నారు. అమూల్ బేబీ జగన్ రెడ్డి గుజరాత్ అమూల్ మనకు వద్దు, రైతుల సంఘం సంగం మనకి ముద్దు అన్నారు. సైకో పాలన అంతమొందించి, సైకిల్ పాలన తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లాలో చంద్రబాబుకి వచ్చిన స్పందన చూసి, షాక్ లో వైసీపీ...
Advertisements