ఇటీవల వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ పోయిన ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ ``దొంగ ఇంట్లో దొంగ పడినట్టుంది`` అంటూ చమత్కరించారు. ఇప్పుడు వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాక్ కావడంతో లోకేష్ సెటైర్ కి అతికినట్టు సరిపోయింది. వైసీపీ సోషల్మీడియా విభాగం నుంచి ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా టిడిపి, జనసేన సోషల్మీడియా ఖాతాలకు రిపోర్ట్ కొట్టడం, బ్లాక్ చేయించడం, హ్యాకింగ్ ప్రయత్నాలు, మార్ఫింగ్-ఫేక్ పోస్టులకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్. హ్యాకర్లకే హ్యాకర్లులాంటి వైసీపీ హ్యాండిల్ హ్యాక్ చేయడం దొంగ ఇంట్లో దొంగలు పడినట్టుంది అనే సైటెర్లు సోషల్మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఇటీవల టిడిపి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినప్పుడు వైసీపీ సోషల్మీడియా వాళ్లు ట్రోలింగ్ పతాకస్థాయికి చేరింది. శుక్రవారం అర్ధరాత్రి వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తున్నారు. దీంతో టిడిపి, జనసేన సోషల్మీడియా సైన్యం వైసీపీని ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు.
పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ కాపాడుకోలేని వాడు, రాష్ట్రాన్ని ఏమి కాపాడతాడు అని కామెంట్స్ వినపడుతున్నాయి. మరోవైపు సోషల్మీడియా బాధ్యతలు సాయిరెడ్డి నుంచి లాగేసుకుని సజ్జల కొడుకుకి అప్పగించారు. ఇది తట్టుకోలేని సాయిరెడ్డి బ్యాచ్ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేయించిందనే రూమర్లు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రిప్టో కరెన్సీ ప్రమోట్ చేస్తూ, కోతి..చింపాంజీ గిఫ్, ఎమోజీలు పోస్టు చేస్తూ సోషల్మీడియా బాధ్యతలు, రాజ్యసభ ప్యానెల్ చైర్మన్ పోస్టులు కోల్పోయిన వ్యక్తిని ట్రోల్ చేస్తుండడం గమనార్హం.