ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి మరింత దూరం కానుంది. పోలవరాన్ని సోమవారంగా మార్చి 70 శాతం పనులు పూర్తి చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోగానే పోలవరానికి ఆటంకాలు మొదలయ్యాయి. వైసీపీ సర్కారు తెచ్చిపెట్టిన వివాదాలు, రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టుకి గ్రహణం పట్టింది. వైసీపీ ఇరిగేషన్ మంత్రులు మాత్రం 2020,2021,2022లో పోలవరం పూర్తి చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే పోలవరం ఇప్పట్లో పూర్తి కావడం అసాధ్యం అంటూ కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. లోక్‌సభలో ఏపీకి చెందిన ఎంపీలు కేశినేని నాని, లావు కృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్‌లు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు, కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి భిశ్వేశ్వర్ జవాబు ఇస్తూ..పోలవరం నిర్మాణం 2024 లోపు పూర్తి కాదని తేల్చేశారు. 2024కి పోలవరం పూర్తి చేయాలనుకున్నామని.. అయితే వరసగా వచ్చిన భారీ వరదలలో పనులు ముందుకు సాగలేదని ఆ సమాధానంలో కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read