నిన్న తాడేపల్లిలో గడప గడప వర్క్ షాప్ లో, జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. రోజురోజుకీ ప్రభుత్వం పై ప్రజల్లో అసహనం పెరిగిపోతూ ఉండటం, ఎమ్మెల్యేలు అనుకున్నట్టు ప్రజల్లోకి వెళ్లకపోవటంతో, జగన్ మోహన్ రెడ్డి అసహనంతో ఊగిపోయారు. కొంత మంది ఎమ్మెల్యే సమస్యలు చెప్తున్నా, చేయని వాటి గురించి ఎందుకు, చేసిన వాటిని ప్రజల్లోకి ఎందుకు తీసుకుని వెళ్ళలేక పోతున్నారని ఎదురు ప్రశ్నించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం గురించి ఐప్యాక్ టీం ప్రజంటేషన్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు ఎలా పని చేస్తున్నారు అనే విషయం పై, వారు అందరి ముందు చూపించారు. అయితే ఈ ప్రజంటేషన్ తరువాత జగన్ అందుకున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు ఈ కార్యక్రమం ఇంకా మొదలు పెట్టలేదని, వారికి నో టికెట్ అని చెప్పారు. ఆ లిస్టు లో బొత్స, ఆళ్లనాని, చక్రపాణిరెడ్డి, నల్లపురెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, అనిల్‌కుమార్, వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. అయతే వారు కారణాలు చెప్పే ప్రయత్నం చేయగా, జగన్ పట్టించుకోలేదు. మిగతా వారికి వార్నింగ్ ఇస్తున్నా అని, నెల రోజుల్లో మార్పు కనిపించాలని అన్నారు. కొంత మంది కేవలం తూతూమంత్రంగా ప్రజల ముందుకు వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేసారు. ప్రజల్లోనే ఉండాలని, దాని బట్టే టికెట్లు ఉంటాయని అన్నారు. అయితే పులివెందుల సంగతి ఏమిటి అంటూ, కొంత మంది ఎమ్మెల్యేలు సటైర్ లు వేస్తున్నారు. బయటకు రావాల్సిన జగన్ రాకుండా, ఎమ్మెల్యేలు, మంత్రులను తిట్టటం ఏమిటి అంటూ కొంత మంది పెదవి విరుస్తున్నారు.
ఆ ఏడుగురు ఎమ్మెల్యేలకు నో టికెట్.. ఐప్యాక్ టీం ప్రజంటేషన్ వేసి, వాళ్ళకు టికెట్ లేదని తేల్చి చెప్పిన జగన్..
Advertisements